Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. ఎలా మొదలుపెడతాడో?

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:49 PM GMT
ఎన్టీఆర్.. ఎలా మొదలుపెడతాడో?
X
మొత్తానికి తెలుగు సినిమాల్లో సంక్రాంతి తర్వాత అతి పెద్ద ధమాకాకు రంగం సిద్ధమైంది. ఎన్నడూ లేని విధంగా దసరా పండక్కి కూడా ఈసారి భారీ సినిమాల మోత మోగబోతోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రెండు ఆరు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. జైలవకుశ.. స్పైడర్. వీటితో పాటు ‘మహానుభావుడు’ సైతం ఓ పెద్ద సినిమా స్థాయిలో హైప్ తెచ్చుకుంది. ఎనిమిది రోజుల వ్యవధిలో ఈ మూడు క్రేజీ సినిమాలు విడుదలవుతుండటం సినీ ప్రియులకు పండగే. ముందుగా గురువారం ‘జై లవకుశ’ దసరా ధమాకాకు శ్రీకారం చుడుతోంది.

ఎంతో ఆశావహంగా కనిపిస్తున్న దసరా సీజన్ కు ఎన్టీఆర్ ఎలాంటి ఆరంభాన్నిస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. త్రిపాత్రాభినయం చేసిన సినిమాను రికార్డు స్థాయిలో ఆరు నెలల్లోనే పూర్తి చేయడం తారక్ కే చెల్లింది. అంత గొప్ప ట్రాక్ రికార్డు ఏమీ లేని బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘జై లవకుశ’ మొదలుపెట్టినపుడు ఈ చిత్రంపై జనాల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ షూటింగ్ మొదలైన నెల రోజులకే ప్రమోషన్ మొదలుపెట్టి.. విడుదల ముందు రోజు వరకు ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టడం ద్వారా హైప్ పరంగా ఢోకా లేకుండా చూసుకుంది చిత్ర బృందం.

ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రతో ఎన్టీఆర్ ఎంతగా జనాల దృష్టిని ఆకర్షించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘జై లవకుశ’ ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుంటుంది.. ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది.. తొలి రోజు.. తొలి వారాంతంలో.. తొలి వారంలో.. ఫుల్ రన్లో ఎంత వసూళ్లు రాబడుతుందనే విషయంలో అభిమానుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. మరి ‘జై జై లవకుశ’ ఫలితమేంటన్నది ఇంకొన్ని గంటల్లోనే తెలుసుకుందాం.