Begin typing your search above and press return to search.

మొదటి వారంలో బాగానే తెచ్చాడు కాని..

By:  Tupaki Desk   |   28 Sep 2017 6:06 PM GMT
మొదటి వారంలో బాగానే తెచ్చాడు కాని..
X
ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవకుశ తొలివారం రన్ పూర్తి చేసుకుంది. రివ్యూలు నెగిటివ్ గా ఉన్నా.. టాక్ మిక్సెడ్ గా వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. వీకెండ్ కి ఓ రోజు ముందే రిలీజ్ కావడం జైలవకుశకు బాగానే కలిసొచ్చింది. తొలి వారం ముగిసేసరికి.. ప్రపంచవ్యాప్తంగా జై లవకుశ 61 కోట్ల రూపాయల షేర్ సాధించడం విశేషం.

ఏరియాలవారగా చూస్తే నైజాంలో అత్యధికంగా 13.4 కోట్లు.. సీడెడ్ నుంచి 9.3 కోట్లు.. నెల్లూరు నుంచి 1.99 కోట్లు.. గుంటూరు 4.98 కోట్లు. కృష్ణా 3.68 కోట్లు.. వెస్ట్ 2.95 కోట్లు.. ఈస్ట్ నుంచి 4.62 కోట్లు.. ఉత్తరాంధ్ర ఏరియాలో 4.98 కోట్ల షేర్ ను జై లవకుశ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 45.9 కోట్ల షేర్ వసూలు కాగా.. గ్రాస్ 75 కోట్లను దాటింది. కర్నాటకలో కూడా ఈ చిత్రం బాగా పెర్ఫామ్ చేసింది. తొలి వారం ముగిసేసరికే కర్నాటలో 7.25 కోట్లు వసూలయ్యాయి. తమిళనాడు 1 కోటి.. రెస్టాఫ్ ఇండియా 80 లక్షలు.. అమెరికా నుంచి 4.8 కోట్లు.. రెస్టాఫ్ వరల్డ్ 1.5 కోట్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 61.26 కోట్ల రూపాయల షేర్ వసూలు కాగా.. గ్రాస్ లెక్క 105 కోట్లుగా ఉంది.

అయితే.. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 86కోట్లకు విక్రయించారు. ఖర్చులు కూడా కలుపుకుంటే 90 కోట్లవరకూ వసూలయితేనే జై లవకుశ సేఫ్ జోన్ లోకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను పరిశీలిస్తే.. ఇది కొంచెం పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. బ్రేక్ఈవెన్ కు ఇంకా చాలా దూరం ఉండడంతో.. జై లవకుశ ఫైనల్ రిజల్ట్ పై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఉంది.