Begin typing your search above and press return to search.

అఫీషియల్: జై లవకుశ ఫస్ట్ లుక్ ఆ రోజే..

By:  Tupaki Desk   |   15 May 2017 10:08 AM GMT
అఫీషియల్: జై లవకుశ ఫస్ట్ లుక్ ఆ రోజే..
X
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ టీజర్ లాంచ్ డేట్ గురించి అధికారిక సమాచారం వచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు సాయంత్రమే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను పరిచయం చేయబోతున్నారు. గత నెలలో శ్రీరామనవమి సందర్భంగా ‘జై లవకుశ’ లోగో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తుపాకి.కామ్ చాలా రోజుల కిందటే వెల్లడించింది. ఇప్పుడు దీనిపై అధికారిక సమాచారం వచ్చింది. ఫస్ట్ లుక్ గురించి అనౌన్స్ మెంట్ వచ్చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు.

‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి నెగెటివ్ రోల్ అని కూడా అంటున్నారు. మరి ఏ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారో చూడాలి. మూడు పాత్రల్నీ ఒకేసారి పరిచయం చేస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఐతే నెగెటివ్ రోల్ గెటప్ అదీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. దాన్ని సర్ప్రైజ్ లాగా దాచి పెట్టాలని చిత్ర బృందం భావిస్తోందట.‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘జై లవకుశ’ను ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళంలో చాలా ఏళ్ల కిందట అజిత్ హీరోగా నటించిన ‘వరలారు’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమా అని ప్రచారం జరుగుతోంది. అందులో అజిత్ త్రిపాత్రాభినయం చేశాడు.