Begin typing your search above and press return to search.

'జై భీమ్' కోర్టు హాల్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా!

By:  Tupaki Desk   |   9 Nov 2021 9:38 AM GMT
జై భీమ్ కోర్టు హాల్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా!
X
సూర్య ప్రథాన పాత్రలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జై భీమ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా డైరెక్ట్‌ విడుదల అయిన ఈ సినిమాను జనాలు బాగా ఆధరిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌ రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునేది.. భారీ వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమాలు అంటేనే చాలా సహజంగా ఉంటాయి. పాత్రలను మన పక్కన చూస్తున్నట్లుగా చూపిస్తారు. తెలుగు సినిమాల్లో తరహాగా హడావుడి ఆర్బాటాలు తమిళ సినిమాల్లో ఉండవు. అందుకు నిదర్శణం సినతల్లి పాత్ర అనడంలో సందేహం లేదు. ఆమె పాత్రను చిత్రంలో చూపించిన తీరు అద్బుతం. కొన్ని పోలీస్ స్టేషన్ సన్నివేశాలు మరియు కోర్టు సన్నివేశాలు ఎంత నాచురల్‌ గా వచ్చాయో తెల్సిందే.

సినిమాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంకు ప్రథాన కారణం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ అనడంలో సందేహం లేదు. జై భీమ్‌ ఎక్కువ శాతం కోర్టు సన్నివేశాలను కలిగి ఉంది. తెలుగు సినిమాల్లో కోర్టుకు జై భీమ్ లో చూపించిన కోర్టుకు చాలా తేడా ఉంది. అసలు కోర్టులు ఇలాగే ఉంటాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు హైకోర్టు అచ్చుగుద్దినట్లుగా ఇలాగే ఉంటుంది. ఇప్పటి వరకు అక్కడి విజువల్స్ ను ఎవరు బయటకు తీసుకు రాలేదు. ఎందుకంటే మద్రాస్ హైకోర్టులో పోన్ లకు అవకాశం లేదు. కనుక అక్కడ ఎలా ఉంటుంది అనేది బయటి వారికి తెలియదు. కాని లాయర్‌ చంద్రు రాసిన పుస్తకంలో కొన్ని ఫొటోలు మరియు సన్నివేశాలు కోర్టు ఎలా ఉంటుంది అనేది చెప్పాడు. దాన్ని బట్టి కోర్టు హాలు మరియు ప్రాంగణంను డిజైన్‌ చేయడం జరిగింది.

అందుకోసం ఇప్పుడు కోర్టులో పని చేస్తున్న కొందరు గుమస్తాలు మరియు లాయర్‌ లతో కూడా చర్చలు జరిపారట. వారు ఇచ్చిన ఇన్‌ పుట్స్ ఆధారంగా ఈ కోర్టు హాల్‌ సెట్ ను నిర్మించడం జరిగింది. సూర్య ఈ కోర్టు హాల్‌ కోసం భారీగానే ఖర్చు చేయించాడని తెలుస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వారు సినిమాకు సంబంధించిన మేకింగ్ విషయాల వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా కోర్టు హాల్ నిర్మాణంకు సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్‌ సభ్యులు పంచుకున్నారు. ఈ కోర్టు హాల్‌ ను నెల లోపులోనే పూర్తి చేశారట. కోర్టు లో ఉండే అన్ని వసతులను కల్పించేందుకు గాను కాస్త ఎక్కువ ఖర్చు అయినా కూడా రియల్‌ కోర్టు హాల్‌ కు దగ్గరకు తీసుకు వచ్చామని వారు చెప్పారు. కోర్టు సిబ్బంది ఈ సెట్‌ ను చూసిన సమయంలో ఆశ్చర్యపోయారని.. అచ్చు నిజమైన మద్రాస్‌ కోర్టు హాల్‌ ఉన్నట్లుగానే ఉందని వారు చెప్పారని మేకర్స్ చెప్పుకొచ్చారు. కేవలం కోర్టు హాల్‌ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించి ఇంకా పలు సెట్టింగ్స్ ను చక్కగా రూపొందించారు. 1970 ల్లో పల్లెలు.. గిరిజన ప్రాంతాలు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నాలు చేశారు.