Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ హడావుడి.. లగాన్ తర్వాత జై భీమ్ కే ఆ ఘనత!!

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:46 PM GMT
ఆస్కార్‌ హడావుడి.. లగాన్ తర్వాత జై భీమ్ కే ఆ ఘనత!!
X
2001 సంవత్సరంలో బాలీవుడ్‌ లో వచ్చిన అమీర్ ఖాన్ సూపర్‌ హిట్‌ మూవీ 'లగాన్‌' కు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. అయితే ఆ సినిమా కు ఆస్కార్‌ దక్కలేదు కాని నామినేషన్ దక్కడమే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు వందల.. వేల సినిమాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ పై వచ్చాయి కాని ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్ ను దక్కించుకోలేక పోయింది. పదుల సంఖ్యలో సినిమాలను ప్రతి ఏడాది ఇండియా నుండి పంపించడం... అవి ఒట్టి చేతులతో తిరిగి రావడం జరుగుతుంది. కనీసం ఫైనల్ నామినేషన్ వరకు కూడా వెళ్లని పరిస్థితి. కాని రెండు దశాబ్దాల తర్వాత లగాన్‌ రికార్డ్‌ ను తమిళ సినిమా అందుకోబోతున్నట్లుగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన ఎంట్రీలను జల్లెడ పడుతూ.. వడబోస్తూ ఫైనల్‌ నామినేషన్స్ ను ప్రకటించబోతున్నారు. అందులో సూర్య నటించిన జై భీమ్‌ సినిమా బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఫైనల్‌ నామినేషన్స్‌ ను దక్కించుకోబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన వార్తలను కవర్‌ చేస్తున్న ప్రముఖ ఆంగ్ల పత్రికలు ఇప్పుడు జై భీమ్‌ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుందని విశ్లేషిస్తున్నారు. లిస్ట్ లో టాప్‌ లో భీమ్ ఉంది కనుక ఖచ్చితంగా అవార్డు చివరి మెట్టు వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా జై భీమ్‌ విషయంలో చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

ఇండియన్ సినిమాలకు ఆస్కార్‌ అవార్డు అనేది అందని ద్రాక్షే అయ్యింది. ప్రతి ఏడాది వేల కోట్ల బిజినెస్ చేస్తూ.. భారీగా వసూళ్లు రాబట్టే సినిమాలను తీస్తున్న ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఒక్కటి అంటే ఒక్కటి ఆస్కార్‌ అవార్డును కూడా దక్కించుకోలేక పోతున్నారు. కనీసం ఫారిన్‌ బెస్ట్‌ మూవీ విభాగంలో కూడా ఇండియన్‌ సినిమాలు నిలువలేక పోవడం విచారకరం అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో జై భీమ్‌ సినిమా కు నామినేషన్స్‌ లో చోటు దక్కడం ఖాయం అని అంటున్నారు. ఈ సమయంలో జై భీమ్ ఆ ఒక్క మెట్టు కూడా ఎక్కి అవార్డును దక్కించుకోవాలని ప్రతి ఒక్క ఇండియన్‌ సినీ అభిమాని కోరుకుంటున్నాడు. మరి జై భీమ్ ఆ ఘనత సాధించేనా చూడాలి.