Begin typing your search above and press return to search.

బాలయ్య టాటూలకు.. లేడీసూ క్రేజీయే

By:  Tupaki Desk   |   16 Feb 2016 5:05 PM GMT
బాలయ్య టాటూలకు.. లేడీసూ క్రేజీయే
X
నందమూరి నటసింహం బాలకృష్ణకు మాస్ లో ఫుల్ క్రేజ్ ఉంది. మాస్ రచ్చ చేసే హీరో అయిన బాలయ్యకు అంతే సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. సినిమా బాగుందని టాక్ వస్తే.. థియేటర్లను చుట్టుముట్టేస్తారు ఫ్యామిలీ జనాలు. కానీ ఇప్పుడు బాలయ్యకి మహిళల్లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో... నాని మూవీ కృష్ణగాడి వీర ప్రేమగాధ ప్రూవ్ చేసింది.

నాని కొత్త సినిమాలో బాలయ్య అభిమానిగా నటించి, చేతిపై జై బాలయ్య టాటూతో కనిపిస్తాడు. ఇలా బాలయ్యపై అభిమానాన్ని ఓ సీన్ కి పరిమితం చేయకుండా.. అడుగడుగునా చూపిస్తూ.. సినిమాకి బాగానే యూజ్ చేసుకున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. అదే టైంలో జై బాలయ్య టాటూ కూడా ట్రెండ్ అయిపోయింది. సినిమా రిలీజ్ నాటికే జై బాలయ్య టాటూలకు క్రేజ్ వచ్చేసింది. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య టాటూలతో ఫోటోలు దిగి ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అమ్మాయిల్లోనూ ఈ ట్రెండ్ ఊపందుకుంది.

ఆన్ లైన్ లో ఫోటోలు పోస్ట్ చేయడమంటే.. ఎక్కువగా కుర్రకారు ఈ జోరు చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవతరం అమ్మాయిల్లోనూ బాలయ్య అంటే ఎంత అభిమానం ఉంటుందో... ఇప్పుడు జై బాలయ్య టాటూలు నిరూపిస్తున్నాయి. మొత్తానికి నందమూరి అభిమానాన్ని ఉపయోగించుకోవడమే కాదు.. తమ అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఓ కొత్త రూట్ చూపించాడు నాని.