Begin typing your search above and press return to search.

జై బాల‌య్య‌.. ఆ విష‌యంలో క్లారిటీ లేదేమ‌య్యా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 7:31 AM GMT
జై బాల‌య్య‌.. ఆ విష‌యంలో క్లారిటీ లేదేమ‌య్యా?
X
గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌'అఖండ‌'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ వ‌సూళ్ల సునామీని సృష్టించి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ అందించిన ఉత్సాహంతో ఇండ‌స్ట్రీ ఊపిరి పీల్చుకుంది. అంత వ‌ర‌కు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌కా రారా? అని భ‌యాందోళ‌న‌కు గురైన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు 'అఖండ‌' బ్లాక్ బ‌స్ట‌ర్ తో కొండంత ధైర్యంతో ముంద‌డుగేశారు.

ఈ మూవీ త‌రువాత బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాలో న‌టిస్తున్నారు. NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని ఎట్టిప‌రిస్థితుల్లో 2023 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. రిలీజ్ స‌మ‌యాన్ని టార్గెట్ గా పెట్టుక‌న్న చిత్ర బృందం ఈ మూవీని రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నారు.

శృతిహాస‌న్‌, మ‌ల‌యాళ న‌టి హ‌నీ రోస్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ ని ఫ‌స్ట్ హంట్ పేరుతో విడుద‌ల చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేశారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో టుంగీ, బ్లాక్ ష‌ర్ట్,బ్లాక్ గాగుల్స్ ధ‌రించి ష‌ఫెరోషియ‌స్ గా బాల‌య్య క‌నిపించిన లుక్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీలీ వెళ్లింది. అక్క‌డ బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్ ల‌పై పాట‌ల‌తో పాటు ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించార‌ట‌.

ఇదిలా వుంటే ఈ మూవీ టైటిల్ విష‌యంలో ఇప్ప‌టికీ చిత్ర బృందం క‌న్ఫ్యూజ‌న్ లోనే వున్న‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య సినిమా అంటై టైటిల్ ప‌వ‌ర్ ఫుల్ గా వుండాల్సిందే. టైటిల్ నుంచే ఫ్యాన్స్ లో పూన‌కాలు ఓ రేంజ్ లో మొద‌ల‌వుతాయి. ఈ విష‌యం బాల‌య్య‌తో సినిమా చేసే ప్ర‌తీ ద‌ర్శ‌కుడికి తెలుసు. అందుకే బాల‌య్య‌తో సినిమా అంటూ ముందు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ని ఫైన‌ల్ చేసుకుంటుంటారు. కానీ గోపీచంద్ మ‌లినేని మాత్రం NBK107 టైటిల్ విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూనే వున్నట్టుగా తెలుస్తోంది.

పెద్దాయ‌న‌, రెడ్డిగారు, అన్న‌గారు, జై బాల‌య్యనే టైటిల్స్ గ‌త కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల బాల‌య్య‌పై 'జై బాల‌య్య‌' అంటూ ఓ పాట‌ని షూట్ చేయ‌డం.. దానికి సంబంధించిన వీడియో లీక్ కావ‌డంతో ఇదే టైటిల్ ఫైన‌ల్ అనే వార్త‌లు మొద‌ల‌య్యాయి. అయితే ఇంత వ‌ర‌కు టైటిల్ విష‌యంలో మేక‌ర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ జై బాల‌య్య‌.. ఆ విష‌యంలో క్లారిటీ లేదేమ‌య్యా? అని కామెంట్ లు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.