Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : జాన్వీ కపూర్ అందాల ప్రదర్శణ లో హద్దులు చెరిపేసింది

By:  Tupaki Desk   |   1 April 2022 7:30 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : జాన్వీ కపూర్ అందాల ప్రదర్శణ లో హద్దులు చెరిపేసింది
X
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో మెల్ల మెల్లగా పాగా వేస్తుంది. మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చింది. అయినా కూడా ఆమెకు మంచి ఎంట్రీ అయితే దక్కింది అంటూ బాలీవుడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమా లో జాన్వీ కపూర్ యొక్క నటన గురించి టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాల్లో నటనకు మంచి మార్కులు దక్కించుకుని తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తుంది.

శ్రీదేవి నట వారసురాలు అవ్వడం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్‌ చేసుకునేందుకు జాన్వీ కపూర్‌ చాలా కష్టపడుతుంది. ఈ సమయంలోనే ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెప్పడం.. బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలు చేయడం చూస్తుంటే ఆమె ఏ స్థాయిలో తన యొక్క ప్రతిభను చూపించేందుకు కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక స్టార్‌ కిడ్‌ అవ్వడం వల్ల అందాల ఆరబోత విషయంలో ఒక మోస్తరుగా హద్దులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ ఎంట్రీతోనే హద్దులు చెరిపేసి మరీ అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జాన్వీ కపూర్‌ కెరీర్‌ ఆరంభంలో కాస్త తగ్గి మరీ అందాలను ఎక్స్ పోజ్ చేసినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ హద్దులు చెరిపేసిందా అన్నట్లుగా ఆమె స్కిన్‌ షో ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

గ్రాజియా మిలీనియల్ అవార్డుల కార్యక్రమంలో జాన్వీ కపూర్‌ పాల్గొంది. ఆ సమయంలో ఈ అమ్మడి కాస్ట్యూమ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్‌ అవార్డు కార్యక్రమం రేంజ్ లో జాన్వీ కపూర్‌ ఎంట్రీ ఇవ్వగానే వందలాది కెమెరా కన్నులు ఆమె పై పడ్డాయి. కాస్త బొద్దుగా అయినా కూడా చాలా అందంగా జాన్వీ కపూర్‌ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆమె లాంగ్ ఫ్రాక్ తో కాస్త క్లీ వేజ్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆమె స్వేచ్చగా స్కిన్‌ షో చేస్తుందని.. ఆ స్కిన్‌ షో ఆమెకు మరింత మంది అభిమానులను సొంతం చేసి పెడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె అవార్డుల వేడుక సందర్బంగా కనిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది.

బోల్డ్‌ గా వల్గర్ గా కాకుండా ఇలా అందంగా కొద్ది మంది అమ్మాయిలు.. హీరోయిన్స్ మాత్రమే క్లీ వేజ్ షో చేయగలరు.. అది జాన్వీ కపూర్ కు మాత్రమే సాధ్యం అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట పెద్ద ఎత్తున ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత వ్యవహారం కొనసాగుతుంది. ఇక జాన్వీ కపూర్‌ సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు లో ఈమె సినిమా ఎప్పుడు ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.