Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: జాగ్వార్ యాక్షన్ అదిరిందిలే

By:  Tupaki Desk   |   19 Sep 2016 4:11 AM GMT
ట్రైలర్ టాక్: జాగ్వార్ యాక్షన్ అదిరిందిలే
X
నిఖిల్ కుమార్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కిన జాగ్వార్ కు.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందగా.. ఆ ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది.

జగపతి బాబు.. రమ్యకృష్ణ.. సంపత్ లాంటి సీనియర్లను ట్రైలర్ లోనే చూపించడంతో.. హైప్రొఫైల్ లుక్ వచ్చేసింది. యథావిథిగా ట్రైలర్ కి కానీ.. సినిమాకి కానీ హీరో నిఖిల్ హైలైట్ గా నిలవనున్నాడు. అటు మెడికో గాను.. ఇటు అవసరమైతే జాగ్వార్ గాను.. గెటప్పులు మార్చి ట్యాలెంట్ చూపించే కేరక్టర్ ని నిఖిల్ బాగానే పండించినట్లు కనిపిస్తోంది. తొలి సినిమానే అయినా.. ముందునుంచే అన్ని ట్రైనింగులు తీసుకోవడంతో కుర్రాడు మాంచి ఈజ్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్.. స్టంట్స్.. స్టైల్స్ విషయంలో కుమ్మేశాడు. 'నేనొక మెట్టు ఎక్కడానికి.. పది మందికి మొక్కడానికైనా.. వందమందిని తొక్కడైనా రెడీ' అనే పంచ్ డైలాగ్ కూడా బాగానే పేలింది.

హీరోయిన్ దీప్తి సతి తనవంతుగా గ్లామరస్ పాత్రను చేసేసింది. ఇక.. ట్రైలర్ కు అసలు అట్రాక్షన్ అంటే.. థమన్ అందించిన మ్యూజిక్ నే చెప్పుకోవాలి. ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండ్ నెస్ ను విజువల్స్ రూపంలో చూపించేందుకు దర్శకుడు మహదేవ్ చూపించిన కమిట్మెంట్.. జాగ్వార్ ట్రైలర్ కు అడిషనల్ అడ్వాంటేజ్. మరి డబ్బింగ్ సినిమా టైపులో చూస్తారో.. స్ట్రెయిట్ మూవీ కింద ఆదరిస్తారో.. టాలీవుడ్ ప్రేక్షకులే రిజల్ట్ చెప్పాలి.