Begin typing your search above and press return to search.

తమన్నాని తీసేసి పోస్టర్లేంటి బాసూ!

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:35 AM GMT
తమన్నాని తీసేసి పోస్టర్లేంటి బాసూ!
X
కన్నడ ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తూ.. టాలీవుడ్-కోలీవుడ్ లలో కూడా క్రేజ్ సంపాదించేందుకు గ్రాండ్ లాంఛింగ్ అయిపోతున్నాడు నిఖిల్ కుమార్ గౌడ. జాగ్వార్ అంటూ కన్నడ ఇండస్ట్రీ కలలో కూడా ఊహించని బడ్జెట్ తో సినిమాని రూపొందించేశారు. ప్రమోషన్స్ కూడా హై లెవెల్ లో చేస్తుండడంతో.. అటు శాండల్ వుడ్ తో పాటు.. సౌత్ అంతా జాగ్వార్ పై ఆసక్తి నెలకొంది.

అక్టోబర్ 7న జాగ్వార్ రిలీజ్ కు షెడ్యూల్ చేయగా.. ఇప్పుడు రేపే విడుదల అంటూ పోస్టర్స్ వేసేశారు. నిఖిల్ డ్యాన్సులు వేయడం.. బైక్ తోలడం.. హీరోయిన్ దీప్తి సేథితో రొమాన్స్ పండించడం.. కేరక్టర్ ఆర్టిస్టులతో ఫోటోలు.. జాగ్వార్ మాస్ అవతారం చూపించడం.. స్టైలిష్ లుక్స్.. సాంగ్స్ లోని పిక్చర్స్.. అన్ని ఫోటోలు ఇలానే ఉంటాయి. కానీ జాగ్వార్ లో ఐటెమ్ సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీపై ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా పడలేదు.

భారీ మొత్తం తీసుకుని జాగ్వార్ ఐటెం సాంగ్ లో నటించానని ఓపెన్ గా ఒప్పుకున్న తమ్మూపై ఒక్క పోస్టర్ కూడా వేయకపోవడం.. చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే.. జాగ్వార్ లో మిల్కీ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని.. మొదటి రోజు సినిమా చూసే బైటకొచ్చేవాళ్లకి షాకింగ్ ఉండాలని ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. మరోవైపు జాగ్వార్ తో శాండల్ వుడ్ ఎంట్రీ ఇస్తున్న తమ్మూ.. ఈ మూవీ తర్వాత తనకు అక్కడకూడా వరుస ఆఫర్స్ వస్తాయని హోప్స్ పెట్టేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/