Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ః జాగ్వార్ కుర్రాడు భారీగానే..

By:  Tupaki Desk   |   3 Sep 2016 4:18 AM GMT
ట్రైల‌ర్ టాక్ః జాగ్వార్ కుర్రాడు భారీగానే..
X
క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ జాగ్వార్ టీజ‌ర్ ఇప్ప‌టికే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా వ‌చ్చేసింది. శుక్ర‌వారం రాత్రి బెంగ‌ళూరులో భారీ హంగామా మ‌ధ్య జాగ్వార్ ఆడియో వేడుక నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఒక‌టిన్న‌ర నిమిషం నిడివి ఉన్న ట్రైల‌ర్లో భారీత‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. యాక్ష‌న్.. రొమాన్స్.. కామెడీ బాగానే ద‌ట్టించిన‌ట్లున్నారు. విజువ‌ల్స్.. యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే తెలుగు వెర్ష‌న్ ఆడియో హైద‌రాబాద్ లో భారీగా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు కుమార‌స్వామి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సహా టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లువురు ఈ వేడుక‌కు వ‌స్తారు. అప్పుడే తెలుగు ట్రైల‌ర్ రిలీజ‌వుతుంది.

‘మిత్రుడు’ ఫేమ్ మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ‘జాగ్వార్’కు విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. దీప్తి సాతి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

తమన్ సంగీత దర్శకుడు. తెలుగు వెర్ష‌న్ కోసం బ్ర‌హ్మానందం మీద ప్ర‌త్యేక‌మైన కామెడీ ట్రాక్ రూపొందించ‌డం విశేషం. ‘జాగ్వార్’ను రూ.75 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏ విషయంలోనూ రాజీ పడట్లేదు కుమారస్వామి. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఎన్నెన్ని ఆకర్షణలు జోడించాలో అన్నీ జోడిస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రుతి హాసన్‌తో ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌రు 6న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తారు.