Begin typing your search above and press return to search.

జాగ్వార్ హీరో మరో భారీ సినిమాకు రెడీ!

By:  Tupaki Desk   |   22 Jan 2020 7:49 AM GMT
జాగ్వార్ హీరో మరో భారీ సినిమాకు రెడీ!
X
స్టార్ కిడ్స్ సినిమాలలో తమ అదృష్టం పరిక్షించుకోవడం సర్వసాధారణం. స్టార్ కిడ్స్ అంటే సహజంగా స్టార్ హీరోల తనయులే అనుకుంటాం కానీ సినీ నేపథ్యం ఉన్నవారితో పాటుగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు కూడా హీరోగా పరిచయం అవుతున్నారు. కన్నడ హీరో నిఖిల్ గౌడ విషయమే తీసుకుంటే ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు. కుమారస్వామి గతంలో నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇలాంటి నేపథ్యం ఉన్న కుటుంబానికి వారసుడు నిఖిల్.

నిఖిల్ 'జాగ్వార్' అనే కన్నడ - తెలుగు ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆ తర్వాత 'సీతారామకళ్యాణ' అనే సినిమాలో నటించాడు. 'కురుక్షేత్ర' అనే మరో సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. మరో సినిమా సెట్స్ పై ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ రోజు నిఖిల్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ప్రకటన వచ్చింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నిఖిల్ ఒక స్పోర్ట్స్ జెర్సీ ధరించి బాస్కెట్ బాల్ పోస్ట్ దగ్గర నిలుచున్నాడు. గోల్ కొట్టిన వారు సంతోషం వ్యక్తం చేసినట్టుగా రెండు చేతులో చాపి నిలుచున్నాడు. ఈ సినిమాతో లహరి మ్యూజిక్ వారు సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని సమాచారం. కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీత దర్శకుడు.