Begin typing your search above and press return to search.

సైరా: జగపతిబాబుగారి వీరారెడ్డి అవతారం

By:  Tupaki Desk   |   12 Feb 2019 11:03 AM IST
సైరా: జగపతిబాబుగారి వీరారెడ్డి అవతారం
X
సీనియర్ హీరో జగపతిబాబు గురించి ఇంట్రో అసలే అవసరం లేదు. మిగతా సీనియర్ హీరోలు చాలామంది ఫేడ్ అవుట్ అయిన దశలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ-టర్న్ తీసుకున్న జేబీ ఒక్కసారిగా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడమే కాకుండా సౌత్ భాషలన్నిటిలో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్ గా మారారు. ఒక్క సౌత్ ఏంటి.. హిందీలో అజయ్ దేవగన్ సినిమాలో కూడా నటిస్తున్నారు జేబీ. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఆయన జన్మదినం సందర్భంగా 'సైరా' టీమ్ ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. "వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సైరా నుండి #వీరారెడ్డి డైనమిక్ లుక్ ను విడుదల చేస్తున్నాం. #HBDJagapathiBabu" అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. .. పొడవాటి జుట్టు.. పైన పట్టు తలపాగా.. మెలిదిరిగిన మీసాలు.. పొడవాటి గడ్డం.. ఖరీదైన దుస్తుల్లో యాజ్ యూజువల్ గా జగపతిబాబు హ్యాండ్సమ్ గా ఉన్నారు. వీరారెడ్డిగా జేబీ లుక్ పవర్ఫుల్ గా ఉంది.

'సైరా' టీమ్ మాత్రమే కాదు. జగ్గూభాయ్ కి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మెగా ఫ్యాన్స్ 'హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ గారు' అంటూ 'రంగస్థలం' టచ్ ఇస్తుండడం విశేషం. ప్రెసిడెంట్ గారికి.. సైరా వీరారెడ్డిగారికి... టాలీవుడ్ జగ్గూ భాయ్ కి తుపాకి.కామ్ తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు