Begin typing your search above and press return to search.

చంపేస్తామంటూ జ‌గ‌ప‌తిబాబు బ్ర‌ద‌ర్ కి బెదిరింపు కాల్

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:30 PM GMT
చంపేస్తామంటూ జ‌గ‌ప‌తిబాబు బ్ర‌ద‌ర్ కి బెదిరింపు కాల్
X
భూమాయ.. జంత‌ర్ మంత‌ర్ భూత‌గాదాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. తాజాగా సినీ నటుడు జగపతి బాబు సోదరుడి యుగేంద్ర కుమార్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆయ‌న‌ను ఆయ‌న కుమారుడిని చంపేస్తామ‌ని ప్ర‌త్య‌ర్థి బెదిరించ‌డంతో బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఈ బెదిరింపుల వెన‌క భూత‌గాదా వ్యవ‌హారం బ‌య‌ట‌ప‌డింది. గుట్టల బేగంపేట స్థలం విషయంలో కొంత‌కాలంగా వివాదం న‌డుస్తోందిట‌. ఆ క్ర‌మంలోనే శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు త‌న‌ కుమారుడిని చంపేస్తామని బెదిరించార‌ని ఫిర్యాదు చేశారు.

ఈ బెదిరింపుల‌ వెనుక బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానం పోలీసుల ఎదుట వ్య‌క్తం చేశార‌ట‌. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లాక్ డౌన్ వ‌ల్ల ఆయ‌న కాస్త రిలాక్స్ అయ్యారు.