Begin typing your search above and press return to search.

నా ఫ్రస్ట్రేషన్‌ అంతా చూపిస్తా: జగపతి

By:  Tupaki Desk   |   6 Aug 2015 1:38 PM IST
నా ఫ్రస్ట్రేషన్‌ అంతా చూపిస్తా: జగపతి
X
లెజెండ్‌ సినిమాతో జగపతిబాబు ఫేట్‌ మారిపోయింది. ఆ సినిమాతో విలన్‌ గా కెరీర్‌ ప్రారంభించి ఇక ప్రతి సినిమాలోనూ తనకంటూ ఓ కీలకపాత్ర ఒకటి ఉండేలా క్రియేట్‌ చేసుకున్నాడు. హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ అడ్వాన్సులు అందుకుంటున్నాడు. సేమ్‌ టైమ్‌ ఆర్జన లో బెటర్‌ పొజిషన్‌ లో ఉన్నాడు. టాలీవుడ్‌ లో ప్రతియేటా కనీసం డజను పైగానే సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కోలీవుడ్‌ లోనూ హవా సాగిస్తున్నాడు. అప్పట్లో రజనీకాంత్‌ లింగా చిత్రం లో విలన్‌ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు శ్రీమంతుడు చిత్రంలోనూ మహేష్‌ కి తండ్రి పాత్రలో నటించాడు. అలాగే తమిళంలో ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు. మరిన్ని భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

తమిళ ప్రాజెక్టుల గురించి జగపతి ముచ్చటిస్తూ.. నిఘా, గూఢచర్యం వెండితెరపై చూపిస్తే ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. అందుకే అలాంటి పాయింటుతోనే సెల్వరాఘవన్‌ 'కాన్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తిగా యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులో ప్రతి ఫ్రేము ఎగ్జయిటింగ్‌ గా ఉంటుంది. ఇందులో నేను ఉద్యోగంలోంచి గెంటివేయబడిన ఓ రా ఆఫీసర్‌ గా కీలకపాత్రలో నటిస్తున్నా. క్యారెక్టర్‌ మందు కొట్టి ఫ్రస్ట్రేషన్‌ లో కనిపిస్తుంది. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. సెల్వ రాఘవన్‌ ఎక్కడా రాజీకి రాకుండా నా చేత పని చేయించుకుంటున్నాడు. మైన్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ కూడా వదిలిపెట్టకుండా శ్రమించాల్సొస్తోంది. .. అని చెప్పాడు.

అంతే కాదండోయ్‌ శ్రీమంతుడు తమిళంలో సెల్వంధన్‌ పేరుతో రిలీజవుతోంది. ఇందులో నా పాత్ర తంబీలను ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నా. అలాగే టాలీవుడ్‌ లో వస్తున్న సినిమాలన్నీ ఇక తమిళంలోనూ రిలీజ్‌ కావాలని కోరుకుంటున్నా అని జగపతిబాబు చెప్పారు.