Begin typing your search above and press return to search.

సైరాలో కట్టప్ప అతనేనా?

By:  Tupaki Desk   |   24 Sept 2019 1:13 PM IST
సైరాలో కట్టప్ప అతనేనా?
X
ఇంకో 8 రోజుల్లో సైరా నరసింహారెడ్డి వచ్చేస్తుంది. ఇప్పటికే మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం దీని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . రెండున్నర ఏళ్ళ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆ రకంగానూ ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఒక్కో లీక్ ఆసక్తి రేపెలా ఉంటున్నాయి. తాజా సమాచారం మేరకు సైరాలో చిరంజీవి పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు కోల్డ్ బ్లడెడ్ విలనీ ఓ రేంజ్ లో ఉంటుందట.

స్నేహితుడని నమ్మి దళంలో కీలక బాధ్యతలు అప్పగిస్తే చివరికి సైరానే మోసం చేసే విధంగా చాలా కీలక మార్పులకు కారణమయ్యే విధంగా ఈ పాత్రను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి మలుపులు గతంలో బాహుబలిలోనూ చూశాం. అప్పుడు కట్టప్ప మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.

అదే తరహాలో వీరారెడ్డిగా జగ్గు విశ్వరూపం ఇందులో చూడొచ్చని ఇన్ సైడ్ టాక్. జగపతిబాబు హీరోగా ఉన్నప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పుడు చిరంజీవితో ఎప్పుడూ నటించలేదు. రామ్ చరణ్ రంగస్థలంలో అదరగొట్టిన జగపతిబాబుకి ఇప్పుడు చిరు తో స్క్రీన్ చేసుకోవడం పట్ల అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఈ కట్టప్ప లాంటి ఎపిసోడ్ సైరాలో నిజంగా ఉందో లేదో తెలియాలంటే విడుదల దాకా ఆగాల్సిందే.