Begin typing your search above and press return to search.
అరవింద సమేతలో ఆ సీన్లు బాగా చేయలేదట
By: Tupaki Desk | 16 April 2020 10:00 AM ISTఅరవింద సమేతలో జగపతి బాబు చేసిన బసిరెడ్డి పాత్ర ఎంతగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగపతిబాబు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్‌లో ఒకటిగా అది నిలిచింది. గొంతులో పోటు దిగాక.. దాని తాలూకు బాధను తట్టుకుంటూ, పగతో రగిలిపోతూ కొన్ని సన్నివేశాల్లో జగపతి కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చాలామందికి అంతఃపురం రోజులు గుర్తుకొచ్చాయి జగపతిని ఈ సినిమాలో చూస్తుంటే. ఐతే ఎన్నో ప్రశంసలందుకున్న ఈ పాత్ర విషయంలో జగపతికి పూర్తి సంతృప్తి లేదట. కొన్ని సన్నివేశాల్లో తాను ఇన్వాల్వ్ అయి నటించక పోవడం వల్ల ఔట్ పుట్ సరిగా లేదంటూ ఆయన ఇప్పుడు రిగ్రెట్ అవుతుండటం గమనార్హం.
క్వారంటైన్ స్టోరీస్ పేరుతో జగపతి తన సినిమాల అనుభవాల్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఈ లాక్ డౌన్ టైంలో పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. యోగా చేస్తున్నాను. మనసును ప్రశాంతగా ఉంచుకుంటున్నాను. బాగా నిద్రపోతున్నాను. సినిమాలు చూస్తున్నాను. ముఖ్యంగా నా సినిమాలే కొన్ని ఎంచుకుని చూస్తున్నాను. అందులో నేను ఎలా నటించాను..
బాగా చేశానా.. ఇంకా బాగా చేసుండాల్సిందా అని ఆలోచిస్తున్నాను. నటనపై మన మూడ్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ‘అరవింద సమేత’ చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో నేను సరిగ్గా ఇన్‌వాల్వ్ కాలేదని నాకు అనిపించింది. అందుకు కారణం నా మూడే. అది బాగుంటే ఆ ప్రభావం సన్నివేశాల్లోనూ ఉంటుంది. అందుకే రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను’’ అని చెప్పాడు.