Begin typing your search above and press return to search.

'ఎఫ్‌ సియుకె'తో సంక్రాంతి బరిలో దిగనున్న జగ్గూ భాయ్..!!

By:  Tupaki Desk   |   28 Dec 2020 6:00 AM IST
ఎఫ్‌ సియుకెతో సంక్రాంతి బరిలో దిగనున్న జగ్గూ భాయ్..!!
X
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే అది జగపతి బాబు మాత్రమే. ఒకప్పుడు హీరోగా వెండితెరకు పరిచయమైన జగ్గూ.. ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అభిమాన హీరోగా ఫ్యాన్స్ మనసు దోచుకున్న జగపతి బాబు.. ప్రెసెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. హీరో అయినా క్యారెక్టర్ అయినా ఇట్టే మెప్పించగల జగ్గూ.. త్వరలోనే హీరోగా వెండి తెరపై మళ్ళీ మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జగ్గూ ప్రధాన పాత్ర పోషించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ఎఫ్‌సియుకె(ఫాదర్, చిట్టి, ఉమ్మా, కార్తీక్). ఇటీవల ఈ సినిమా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని జనవరిలో గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇదివరకు జగ్గూ హీరోగా నటించిన సినిమాలు సరైన ప్రమోషన్స్ లేక బోల్తా కొట్టాయి. కానీ ఎఫ్‌సియుకె నిర్మాతలు, శ్రీ రంజిత్ మూవీస్ ఈసారి గట్టి ప్రచారానికి నిర్ణయించుకున్నారట.

అందుకే ఎఫ్‌సియుకె సినిమా ప్రమోషన్స్ భాగంగా సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తున్నారు. అలాగే రోజుకో క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా పై ఆసక్తి రేపుతున్నారు. ఇక ఇందులో ఆరు పదుల వయసులో కూడా జగ్గూ పదహారేళ్ల కుర్రాడిగా పరిచయం చేయబడ్డాడు. ఈరోజు బేబీ సహర్షితను చిట్టిగా పరిచయం చేశారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక మిగతా రెండు ప్రధాన పాత్రలు వచ్చే రెండు రోజుల్లో పరిచయం కానున్నాయి. ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్ల విషయంలో స్పీడ్ పెంచేసారు. శ్రీ రంజిత్ మూవీస్ మంచి కంటెంట్ తో వస్తే గనక జగ్గూ కిట్ లో మరో హిట్ పడుతుంది. ఇక ప్రస్తుతం సంక్రాంతికి ఫ్యామిలీ మూవీస్ ఏమి లేనట్లుగా కనిపిస్తుంది. ఆ లోటును ఎఫ్‌సియుకె భర్తీ చేస్తుందేమో చూడాలి.