Begin typing your search above and press return to search.

అలా లైఫ్ రివర్స్ అయ్యింది

By:  Tupaki Desk   |   11 May 2018 12:16 PM IST
అలా లైఫ్ రివర్స్ అయ్యింది
X
సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి విడ్డురలు చోటు చేసుకుంటాయో ఎవ్వరికి తెలియదు. వెండితెరపై జరిగే మ్యాజిక్కుల కన్నా రియల్ లైఫ్ లో జరిగే ట్విస్ట్ లే వేరు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న వారు పది సినిమాల తరువాత ఎలా ఉంటారో తెలియదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గురువారం జరిగిన నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో జగపతి బాబు అందుకు సంబందించిన కొన్ని కామెంట్స్ చేశారు.

అందరికి తెలిసిందే అయినా ఆయన నోటిగుండా చెప్పడం ఓ విధంగా ఆకర్షించింది. జగపతి బాబు మాట్లాడుతూ.. గతంలో నేను చేసిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు నేల టిక్కెట్టు సినిమా ద్వారా నేను రవితేజ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా అని పాత్రలు రివర్స్ అయ్యాయి అని జగపతి తెలియజేశారు. అంతే కాకుండా ఇప్పటివరకు రవితేజ బిహేవియర్ లో ఏ మాత్రం మార్పు రాలేదని తెలిపారు.

అదే విధంగా రవితేజ ఒక పెద్ద సెలబ్రెటీ అంటూ.. తనతో ఫ్రెండ్లిగా ఉంటాడని తన మనసులోని మాటలను జేబీ బయటకు చెప్పుకున్నారు. ఇదే తరహాలో రవితేజ గతంలో కొంత మంది నటుల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. వాళ్లు ఇప్పుడు మళ్లీ అతని సినిమాల్లో చేస్తున్నారు. ప్రేమకు వేళయెరా లో జేడీ హీరోగా నటించగా రవితేజ చిన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ దుబాయ్ శీను సినిమాలో జేడీ చక్రవర్తి చిన్న పాత్రలో కనిపించాడు.