Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ చెబితే చేశా: జగపతిబాబు

By:  Tupaki Desk   |   23 Aug 2018 7:26 AM GMT
త్రివిక్రమ్ చెబితే చేశా: జగపతిబాబు
X
హీరోగా వెలుగు వెలిగి అనంతరం తెరమరుగైపోయాడు జగపతి బాబు.. వరుస ఫ్లాపులతో ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక సినిమాల్లో నటిస్తానో లేదో అనే మీమాంసలో ఉన్న జగపతి బాబు జీవితాన్ని బోయపాటి శ్రీనివాస్ మలుపుతిప్పాడు. లెజెండ్ మూవీలో బాలక్రిష్ణ కు విలన్ గా జగపతిబాబును ఎంపిక చేశాడు. ఆ నిర్ణయమే జగపతి జీవితాన్ని గొప్ప మలుపుతిప్పింది. విలన్ గా జగపతిబాబు గ్రాండ్ హిట్ అయ్యాడు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

తెలుగు - తమిళం - మలయాళంలో వరుస సినిమాల్లో జగపతికి విలన్ గా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం చేతిలో డజనుకు పైగా సినిమాలున్నాయి. జగపతిబాబు కాల్షీట్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దక్షిణాదిన ఇప్పుడు క్రేజ్ ఉన్న నటుడిగా జగపతి బాబు మారిపోయాడు.

ఇటీవలే నారా రోహిత్ తో కలిసి జగపతి బాబు మళ్లీ హీరోగా మారారు. ‘ఆటగాళ్లు’ అనే సినిమాలో నటించాడు. అసలు ఈ సినిమాలో నటించాలని అనుకోలేదని.. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడం వల్లే చేశానన్నారు. ‘ఆటగాళ్లు’ దర్శకుడు పరుచూరి మురళితో పెదబాబు సినిమా చేశానని .. కాల్షీట్లతో ఈ సినిమా చేయొద్దని డిసైడ్ అయిన సమయంలో మురళి లో మంచి విషయం ఉందని... ఒప్పుకోవాలని త్రివిక్రమ్ చెప్పాడని.. ఆయన చెప్పడంతో ఈ సినిమా చేశానని జగపతి వివరించాడు. ఫైనల్ అవుట్ పుట్ చూశాక చాలా సంతోషంగా అనిపించిందని.. ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఏర్పడిందన్నారు.