Begin typing your search above and press return to search.

సరికొత్త వెబ్ సిరీస్ లో టాలీవుడ్ గ్యాంగ్

By:  Tupaki Desk   |   18 May 2018 1:46 PM IST
సరికొత్త వెబ్ సిరీస్ లో టాలీవుడ్ గ్యాంగ్
X
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా నటినటుల్లో కొత్తగా కనిపించాలనే ఆసక్తి పెరుగుతోంది. అందుకే కొత్త కొత్తగా రియాలిటీ షోలు బయటకు వస్తున్నాయి. యూ ట్యూబ్ అనే కాకుండా ఇంటర్నెట్ లో అనేక రకాల ఫ్లాట్ ఫార్మ్ లు టాలెంట్ చూపించుకోవడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఆ తరహా దారిలో వారి టాలెంట్ ను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు కొంత మంది నటినటులు.

జగపతి బాబు ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ అందరిని అకట్టుకుంటున్నారు. ఆయన వల్ల పక్క రాష్ట్రం నుంచి కొంత మంది సీనియర్ యాక్టర్లకు గట్టి పోటీ తగులుతోంది. ఇకపోతే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వారు చేయబోయే గ్యాంగ్ స్టార్ అనే మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ లో జగపతి బాబు కనిపించనున్నారు. అలాగే మరొక యాక్టర్ నవదీప్ కూడా ఈ వెబ్ సిరీస్ లో అవకాశం అందుకున్నాడు.

వీరితో పాటు సరైన కెరీర్ లేక తో ఇబ్బంది పడుతున్న శ్వేతా బాసు ప్రసాద్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కథ సహకారాన్ని అందించిన రచయిత లక్ష్మీ భూపాల ఈ వెబ్ సిరీస్ కోసం కథతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. గ్యాంగ్ స్టార్స్ ఫస్ట్ లుక్ అయితే బాగానే ఉంది. ఈ వెబ్ సిరీస్ ను రెగ్యులర్ గా కాకుండా కొంచెం విభిన్నంగా బోల్డ్ గా చూపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి