Begin typing your search above and press return to search.

జగపతి బాబు ఊపు తగ్గినట్టుందే!

By:  Tupaki Desk   |   23 Feb 2020 9:29 AM IST
జగపతి బాబు ఊపు తగ్గినట్టుందే!
X
సీనియర్ హీరో జగపతిబాబు సినిమాలు ఒక దశలో వరసగా ఫ్లాప్ అయ్యాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే దశలో విలన్ గా నటించి ఒక్కసారిగా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.. బోయపాటి-బాలయ్య సినిమా 'లెజెండ్' లో విలన్ గా నటించి తనలోని కొత్త కోణాన్ని అందరికీ పరిచయం చేశారు. జగపతి బాబు విలనిజం అందరినీ ఆకట్టుకోవడంతో వెల్లువలా ఆఫర్లు వచ్చిపడ్డాయి.

తెలుగుతో పాటుగా తమిళ.. మలయాళ సినిమాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారు. ఒక దశలో జగ్గూ భాయ్ సౌత్ లోనే బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. 'రంగస్థలం' లో ప్రెసిడెంట్ గారు పాత్ర జగ్గూ భాయికి మంచి పేరుకూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత మాత్రం ఎందుకో జగపతి బాబు హవా తగ్గింది. మునుపటిలా ఎక్కువ ఆఫర్లు లేవని అంటున్నారు. ఇలా ఆఫర్లు తగ్గడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఇలానే కొనసాగితే విలన్ గా కూడా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

అయినా సీనియర్ తెలుగు హీరో అయి ఉండి.. హ్యాండ్సమ్ లుక్స్ తో హీరోకే పోటీ అనిపించే జగ్గుభాయికి ఇలా ఆఫర్లు తగ్గడం అభిమానులకు మాత్రం రుచించడం లేదు. హిందీ జనాలను దిగుమతి చేసుకోవడానికి బదులుగా జగపతిబాబునే తీసుకోవచ్చుగా అంటూ రుసరుసలాడుతున్నారు. సుకుమార్.. లేదా కొరటాల లాంటి వారు ఒక మంచి పాత్ర కనుక ఇస్తే మరోసారి జగ్గూ భాయ్ ఊపులోకి వస్తాడేమో.