Begin typing your search above and press return to search.
జగపతి దుమ్ము లేపేస్తున్నాడుగా!
By: Tupaki Desk | 28 Oct 2016 10:26 AM GMTఏమాటకామాట చెప్పుకోవాలంటే నాయకుడిగా ఎన్నో సినిమాలు చేసినా... పస్తుతం ప్రతినాయకుడిగా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబు కెరీర్ మామూలుగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము దులిపేస్తున్నాడు. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానై జగపతి బాబు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. జగపతి బాబు రీసెంట్ గా "ఇజం" సినిమాలో ఒక స్టైలిష్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటు తమిళ సినిమా, ఇటు మళయాల సినిమాల్లో కూడా ఆయన ఫుల్ బిజీ!
తాజాగా జగపతి బాబు - తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "భైరవ"! ఈ సినిమాలో కూడా జగపతి బాబే ప్రతినాయకుడు. అటు కుర్ర హీరోలకు సరైన విలన్ గా, అటు సీనియర్ హీరోలకు సమ ఉజ్జీగా జగపతి యమ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో దీపావళి కానుకగా "భైరవ" టీజర్ విడుదలయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర విషయానికి వస్తే.. కోపంగా ఫోన్లో యార్రా అవ (ఎవడ్రా వాడు) అంటూ అరుస్తూ కనిపించాడు జగపతి. ఈ టీజర్ చూస్తుంటే విజయ్ మార్కు మాస్ మసాలా సినిమాలాగానే అనిపిస్తుండగా... నిమిషం నిడివి ఉన్న టీజర్లో విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికే ప్రయత్నం జరిగింది. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో జగపతి తనదైన సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడంటే... ఇక తమిళంలోనూ బిజీ అయిపోవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ని ప్రఖ్యాత విజయ ప్రొడక్షన్స్ నిర్మించగా, సీనియర్ డైరెక్టర్ భరతన్ భైరవ కు దర్శకత్వం వహించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/