Begin typing your search above and press return to search.
వావ్!! కౌబాయ్ గెటప్ లో జగ్గూభాయ్
By: Tupaki Desk | 27 Oct 2015 3:50 PM ISTహీరో జగపతిబాబు కేరక్టర్ ఆర్టిస్టుగా మారి.. ఇప్పుడు విలన్ గా టర్నింగ్ ఇచ్చుకున్నాడు. భారీ సినిమాల్లోనూ, స్టార్ హీరోలకు ఫాదర్ కేరక్టర్లు యాక్సెప్ట్ చేస్తూ.. మెస్మరైజ్ చేస్తున్నాడు జగ్గూభాయ్. అయితే.. మనోడిలో హీరో లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. తన యాక్టింగ్ తో చాలాసార్లు స్టార్ హీరోని కూడా డామినేట్ చేసే రేంజ్ ఉంది జగపతికి.
ఫాదర్ కేరక్టర్స్ చేసినంతమాత్రాన నాలో హీరో లేడనున్నారా.. ఇక చూపించను అనుకున్నారా.. అదే జగ్గూ.. అదే హీరోయిజం అన్న రేంజ్ లో ఓ ఫోటోషూట్ తో చెప్పేశాడు జగపతి. కౌబాయ్ గెటప్ తో రీసెంట్ గా జగపతిబాబు చేసిన ఫోటో షూట్ అబ్బురపరిచేలా ఉంది. కౌబాయ్స్ ధరించే లెదర్ టోపీ - చేతిలో సింగిల్ బ్యారెల్ గన్ - జీన్స్ ప్యాంట్ - లాంగ్ బూట్స్ వేసుకుని.. అదరగొట్టేశాడు. వీటన్నిటి కంటే మంచి జగ్గూ కౌబాయ్ కేరక్టర్ కి ఫుల్ ప్లెడ్జెడ్ లుక్ తీసుకొచ్చింది ఆయన గెడ్డం. రఫ్ గా ఉన్న గడ్డంతో.. మళ్లీ వెనకటి రోజులు గుర్తు చేసేశాడు. జగపతిబాబులో హీరో కట్స్ అయిపోయాయనే ఎవరికన్నా అనుమానాలుంటే వాటిని ఒకే ఒక్క ఫోటోతో తీర్చేశాడు.
ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి మనోడి ఖాతాలో. తెలుగు సినిమాలకు తెలుగు విలన్లు లేరనే కొరతను తీర్చేయడానికే వచ్చాడా అన్న రేంజ్ లో ఉంది జగపతిబాబు కెరీర్. ఈ సీనియర్ హీరోని, వచ్చిన రెస్పాన్స్ ని చూశాక.. శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి హీరోలు కూడా కరెక్ట్ కేరక్టర్ వస్తే.. తాము కూడా విలన్ టర్నింగ్ ఇచ్చుకోడానికి అబ్జెక్షన్ లేదంటున్నారంటే.. అర్ధమవుతుంది జగపతి రేంజ్ ఏంటో. ఎనీవే.. చాలా రోజుల తర్వాత సూపర్ లుక్ తో అలరించిన జగ్గూభాయ్ కి హ్యాట్సాఫ్ చెబ్దాం.