Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : జగ్గూభాయ్ చిన్న పిల్లాడు అయ్యాడే!

By:  Tupaki Desk   |   18 Sep 2021 2:30 AM GMT
ఫొటోటాక్ : జగ్గూభాయ్ చిన్న పిల్లాడు అయ్యాడే!
X
సీనియర్‌ స్టార్‌ హీరో జగపతిబాబు ప్రస్తుతం టాలీవుడ్‌ లో సెకండ్‌ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్‌ రోల్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఫ్యామిలీ హీరోగా మహిళ ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న జగపతిబాబు ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. జగపతిబాబు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రతి సినిమాలో కూడా ఆయన పాత్రలు హైలైట్‌ అవుతున్నాయి. ఆకారణంగానే ఆయనతో నటించేందుక స్టార్‌ హీరోలు కూడా సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న జగపతిబాబు చాలా బిజీగా ఉన్నాడు.

ఇంత బిజీ లైఫ్‌ లో జగపతిబాబు కాస్త బ్రేక్ తీసుకోవడం కోసం యూఎస్ వెళ్లాడు. హీరోగా చేసే సమయంలో కుటుంబంకు సమయం ఎక్కువగా కేటాయించేవాడు కాదు అనే టాక్ ఉండేది. కుటుంబం విషయాన్ని పట్టించుకోకుండా జగపతిబాబు వ్యవహరించేవాడని ఇప్పటికి కూడా టాక్ ఉంది. అయితే ఇప్పుడు జగపతిబాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన తన కుటుంబంకు చాలా సమయం కేటాయిస్తున్నాడు. కుటుంబ సభ్యులను ప్రధానంగా చూస్తూ వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా యూఎస్ లో కుటుంబ సభ్యులతో జగపతిబాబు సరదా సమయంను గడిపాడు.

ట్విట్టర్ లో జగపతిబాబు ఈ ఫొటోను షేర్ చేసి యూఎస్ లో కుటుంబంతో మంచి సమయంను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇష్టమైన పెట్స్ మరియు బుక్స్‌ కూడా నాకు తోడుగా ఉన్నాయి. స్వచ్చమైన ప్రేమను పెట్స్ మరియు బుక్స్ అందిస్తాయి. మనుషులు ఈ విషయాన్ని నేర్చుకోవాలంటూ జగపతిబాబు విజ్ఞప్తి చేశాడు. మొత్తానికి చిన్న పిల్లాడి మాదిరిగా పెట్స్ తో ఆడుకుంటూ బుక్స్ చదువకుంటూ జగపతిబాబు యూఎస్ లో సరదాగా సమయాన్ని గడిపేస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్‌ అయ్యి ఉన్న జగపతిబాబు వచ్చే నెలలో షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం అందుతోంది.