Begin typing your search above and press return to search.

సల్లూ భాయ్ సినిమాలో జగ్గూ భాయ్‌

By:  Tupaki Desk   |   20 Dec 2022 10:00 PM IST
సల్లూ భాయ్ సినిమాలో జగ్గూ భాయ్‌
X
టాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ జగపతి బాబు సెకండ్‌ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వరుస సినిమాలు చేస్తున్న జగపతి బాబు తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీ లో కూడా ఈయన నటిస్తూ ఉన్నాడు.

ప్రస్తుతం జగపతిబాబు బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ లో జగ్గూ భాయ్ నటిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ విషయమై మరింత స్పష్టత వచ్చింది.

స్వయంగా సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్నట్లుగా జగపతి బాబు తెలియజేశాడు. సల్మాన్ భాయ్‌ తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్న జగ్గూ భాయ్ అంటూ తన వర్కౌట్ వీడియో ను సోషల్‌ మీడియాలో జగపతి బాబు షేర్ చేశాడు. జగ్గూ భాయ్ అంటే మరెవ్వరో కాదు నేనే అంటూ కూడా పేర్కొన్నాడు

జగపతి బాబు వయసు ఆరు పదులు దాటినప్పటికి చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఆయన కుర్రాళ్లతో సమానంగా జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తూ చాలా ఫిట్‌ గా కనిపిస్తూ ఉంటాడు. కుర్ర హీరోల సినిమాలో విలన్ రోల్స్ చేస్తున్న జగపతి బాబు వారితో సమానంగా ఫైట్స్ కూడా చేస్తూ ఉంటాడు. అందుకు ఈ వర్కౌట్స్ కారణం అనడంలో సందేహం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.