Begin typing your search above and press return to search.
జగపతికి మళ్లీ పంచ్ పడిందిగా..
By: Tupaki Desk | 15 Jan 2017 11:46 AM GMT‘లెజెండ్’ సినిమాతో జగపతిబాబు కెరీర్ అనుకోని మలుపు తిరిగింది. హీరోగా కెరీర్ క్లోజ్ అయిపోతున్న దశలో విలన్ పాత్రలకు మళ్లడం ద్వారా భలేగా రైజ్ అయ్యాడు జగపతి. ‘లెజెండ్’ వచ్చిన ఏడాది తిరిగేసరికి ఆయన ఫుల్ బిజీ అయిపోయాడు. క్రమంగా పొరుగు భాషలకూ ఆయన క్రేజ్ విస్తరించింది. తమిళంలోనూ వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది మలయాళంలోనూ అడుగుపెట్టాడు. ఐతే మలయాళంలో ‘మన్యంపులి’ ఆయనకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది కానీ.. ముందు నుంచి కలిసి రాని కోలీవుడ్లో మాత్రం మళ్లీ మళ్లీ ఆయనకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి.
గతంలో తమిళంలో అర్జున్ హీరోగా నటించిన ‘శివకాశి’ అనే సినిమా చేశాడు జగపతి. అది పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత విక్రమ్ కథానాయహీరోగా చేసిన ‘శివతాండవం’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. అది కూడా చీదేసింది. గత నెలలో విడుదలైన విశాల్ మూవీ ‘ఒక్కడొచ్చాడు’ కూడా జగపతికి నిరాశనే మిగిల్చింది. తాజాగా కోలీవుడ్లో జగపతి కెరీర్ ను మలుపు తిప్పేస్తుందని భావించిన విజయ్ సినిమా ‘భైరవ’ కూడా ఆయనకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘భైరవ’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ సినిమా కావడంతో జగపతి క్యారెక్టర్ కూడా అంతగా పేలలేదు. విజయ్ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండుంటే కచ్చితంగా జగపతి దశ తిరిగిపోయేదే. కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు. దీంతో జగపతికి ఇక అక్కడ కష్టమేనేమో.