Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం బ‌రిలోకి దిగిన బ‌సిరెడ్డి!

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:22 PM GMT
మ‌హేష్ కోసం బ‌రిలోకి దిగిన బ‌సిరెడ్డి!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా 'అర‌వింద స‌మేత‌'. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫులో ఐదు రూపాయ‌ల ఫ్యాక్ష‌న్ చేసే ప్ర‌తినాయ‌కుడు బ‌రిరెడ్డి క్యారెక్ట‌ర్ కూడా అంతే ప‌వ‌ర్ ఫుల్ గా నిలిచి సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా మారిన విష‌యం తెలిసిందే. బ‌సిరెడ్డి పాత్ర‌లో జ‌గ్గూ భాయ్ జ‌గ‌ప‌తిబాబు న‌టించి ఆ పాత్ర‌కు ప్రాణం పోసిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఈ మూవీ త‌రువాత మ‌రో సారి బ‌సిరెడ్డిని త్రివిక్ర‌మ్ రంగంలోకి దించేస్తున్నాడు. 'అర‌వింద్ స‌మేత‌' మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిలిచిన బ‌సిరెడ్డి క్యారెక్ట‌ర్ లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబుని త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కు త్రివిక్ర‌మ్ విల‌న్ గా ఫైన‌ల్ చేసుకున్నాడని తెలిసింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్నఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ బుధ‌వారం హైద‌రాబాద్ అమీర్ పేట‌లో మొద‌లైంది.

అమీర్ పేట్ స‌మీపంలో వున్న సార‌ధీ స్టూడియోస్ లో ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. బుధవారం నుంచే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇందులో విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారని తెలిసింది. 'అర‌వింద్ స‌మేత‌' మూవీలో వ‌ల‌న్ గా బ‌సిరెడ్డి పాత్ర‌లో న‌టించి జ‌గ‌ప‌తి బాబు విల‌క్ష‌ణ‌మైన విల‌నిజంతో ఆక‌ట్టుకున్న జ‌గ‌ప‌తిబాబునే త్రివిక్ర‌మ్ మళ్లీ ఎంచుకున్నాడ‌ని తెలుస్తోంది.

మ‌హేష్ బాబు పాల్గొన‌గా రామ్ - ల‌క్ష్మ‌ణ్ ల నేతృత్వంలో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన రోజే ఈ మూవీ మేక‌ర్స్ కు సంబంధించిన వివిధ అపార్ట్ మెంట్స్, ఆఫీసుల‌పై ఐటీ రైట్స్ జ‌ర‌గ‌డం తెలిసిందే. ఈ రైడ్స్ కార‌ణంగా చిత్ర బృందం SSMB28 ప్రారంభ‌మైన విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. ఐటీ రైడ్స్ కార‌ణంగానే సైలెంట్ గా షూటింగ్ మొద‌లు పెట్టార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

'శ్రీ‌మంతుడు' మూవీతో మ‌హేష్ , జ‌గ‌ప‌తిబాబు ఫాద‌ర్ అండ్ స‌న్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. SSMB28 లో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా న‌టిస్తున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఎలా వుంటాయో.. ఏ రేంజ్ లో మ‌హేష్ అభిమానుల్ని ఆకట్టుకుంటాయో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఆగ‌స్టు లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.