Begin typing your search above and press return to search.
జగ్గూ భాయ్ అక్కడ బిజీ బిజీ
By: Tupaki Desk | 26 Oct 2020 6:00 PM ISTఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో పుష్కర కాలం పాటు స్టార్ గా వెలుగు వెలిగిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడం మరియు హిందీల్లోనూ ఈయనకు ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో మూస పాత్రలే దక్కుతున్నాయనే ఉద్దేశ్యంతో కన్నడంలో జగపతి బాబు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అక్కడ మంచి పాత్రలు దక్కడంతో పాటు స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ అక్కడ జగ్గూ భాయ్ కి ఉందట. దానికి తోడు కన్నడ ప్రేక్షకులు జగపతిబాబును ఎక్కువగా అభిమానిస్తున్నారు.
ఇటీవల జగపిబాబు 'మదగజ' కన్నడ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. దసరా సందర్బంగా ఆ సినిమా షూటింగ్ తన పార్ట్ ను పూర్తి చేసుకున్నట్లుగా జగ్గూ భాయ్ చెప్పాడు. మరో వైపు కన్నడ స్టార్ డైరెక్టర్ దర్శన్ దర్శకత్వంలో రాబర్ట్ మూవీలో కూడా జగపతిబాబు నటిస్తున్నాడు. కన్నడంలో వరుసగా వస్తున్న ఆఫర్ల కారణంగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి జగపతిబాబు వచ్చాడట. అందుకే రాబర్ట్ సినిమా కోసం తానే స్వయంగా డబ్బింగ్ చేప్పుకునేందుకు కన్నడం నేర్చుకుంటున్నాడట. కన్నడంలో జగపతి బాబు డబ్బింగ్ చెప్పాలని కన్నడ నేర్చుకుంటున్నాడు అంటే అక్కడ ఆయనకు ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.