Begin typing your search above and press return to search.

లీడ్ రోల్.. 60 ఏళ్ల వృద్ధుడిగా జగ్గూభాయ్!

By:  Tupaki Desk   |   13 Oct 2016 3:46 PM IST
లీడ్ రోల్.. 60 ఏళ్ల వృద్ధుడిగా జగ్గూభాయ్!
X
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేసిన జగపతి బాబు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్ గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. లెజెండ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి బీభత్సం సృష్టించిన జగపతి వరుసపెట్టి తెలుగు - తమిళ - కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతిబాబు రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలతో సమాన హోదానూ - రెమ్యునరేషన్ నూ మెయింటైన్ చేస్తున్న జగ్గూభాయ్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి లీడ్ రోల్ చేస్తున్నారట. అయితే లీడ్ రోల్ అంటే హీరో కాదని, లీడ్ రోలే అని గట్టిగా చెబుతున్నాడు జగపతి.

ఇప్పటికే ఈ విషయాన్ని జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా ప్రకటించిన జగపతిబాబు... కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మాణంలో హీరోగా ఓ సినిమా ఉంటుందని అన్నారు. అయితే తాజాగా ఆ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలను జాగ్వర్ సక్సెస్ మీట్ లో వెల్లడించారు. అయితే ఈ సినిమాలో తాను 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నానని.. ఇది చాలా వైలెంట్ పాత్ర అని.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పని కూడా జరుగుతుందని జగపతి తెలిపారు. తాను లీడ్ రోల్ లో తెరకెక్కనున్న ఆ సినిమాకు తాను నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటున్నానని, ఆ సినిమాను జగపతి ఆర్ట్ పిక్చర్స్ - చెన్నాంభిక ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తాయని జగపతి బాబు ప్రకటించారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/