Begin typing your search above and press return to search.
జగపతి లాయర్.. అతను డైరెక్టర్
By: Tupaki Desk | 4 Jan 2018 11:09 AM ISTకెరీర్ ఆరంభం నుంచి భిన్నమైన పాత్రలు.. భిన్నమైన సినిమాలతో సాగిపోతున్నాడు నారా రోహిత్. స్టార్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా కథల్ని నమ్మి విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడతను. వేరే హీరోలతో కలిసి తెరను పంచుకోవడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మల్టీస్టారర్లు చేశాడు. వేరే హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించాడు. ఇప్పుడు సీనియర్ నటుడు జగపతిబాబు కాంబినేషన్లో ‘ఆటగాళ్ళు’ అనే సినిమాలో నటిస్తున్నాడు రోహిత్. ఈ చిత్రంలో రోహిత్.. జగపతి.. ఈ ఇద్దరి పాత్రలూ చాలా భిన్నంగా.. పవర్ ఫుల్ గా ఉంటాయట. జగపతి బాబు ఇందులో లాయర్ క్యారెక్టర్ చేస్తాడన్న సమాచారం ఇప్పటికే బయటికి వచ్చింది.
ఇప్పుడు రోహిత్ పాత్ర గురించి కూడా హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో రోహిత్ సినిమా డైరెక్టర్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. లాయర్-డైరెక్టర్ మధ్య వైరం.. ఎత్తులు పై ఎత్తుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. అందుకే ‘ఆటగాళ్ళు’ అనే టైటిల్ పెట్టారట ఈ చిత్రానికి. ‘నీకోసం’.. ‘పెదబాబు’.. ‘ఆంధ్రుడు’ సినిమాల ఫేమ్ పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అధినాయకుడు’తో ఎదురు దెబ్బ తిన్నాక చాలా ఏళ్ల విరామం తీసుకుని.. ఎంతో కసరత్తు చేసి ఈ కథను సిద్ధం చేసుకున్నాడు మురళి. మరి అతడికి.. రోహిత్-జగపతిబాబులకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.