Begin typing your search above and press return to search.
సినీ పరిశ్రమకు సీఎం జగన్ బంపర్ ఆఫర్
By: Tupaki Desk | 18 Dec 2020 9:59 PM ISTకరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఓ పక్క షూటింగులు లేక...మరో పక్క ఆల్రెడీ పూర్తయిన సినిమాలు విడుదల చేయలేక...ఇటు సినీ కార్మికులు అటు హీరోలు - దర్శక నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఓటీటీలో అరకొర సినిమాలు విడుదలైనప్పటికీ థియేటర్లలో విడుదల చేయడం వల్ల వచ్చినంత ఆదాయం రాలేదు. థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులిచ్చినప్పటికీ....భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. ఇలా తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోన్న సినీ పరిశ్రమపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు చేయూతనిచ్చేలా జగన్ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్ డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలను రద్దు చస్తే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్ - మే - జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్ లు సహా - అన్ని థియేటర్లకూ ఫిక్స్ డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకుగాను ప్రతి నెల రూ.3 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఏపీ కేబినెట్ తెలిపింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు థియేటర్లు చెల్లించాల్సిన పిక్స్ డ్ ఎలక్ట్రిసిటీ చార్జిలను చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంతేకాకుండా, మిగిలిన ఆరు నెలలు ఫిక్స్ డ్ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా కేబినెట్ నిర్ణయించింది. తాజాగా జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. ఎలక్ట్రిసిటీ చార్జిలతోపాటు జగన్ కేబినెట్ థియేటర్లకు పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఏ - బి - సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున - సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు ఇవ్వనుంది. వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం విధించిన జగన్ సర్కార్...వచ్చే ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.4.18 కోట్ల భారం పడనుంది. తాజాగా జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సినీ పరిశ్రమ - థియేటర్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.