Begin typing your search above and press return to search.
`జగదేకవీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ అత్యాశేనా?
By: Tupaki Desk | 13 Oct 2020 2:20 PM ISTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ప్రత్యేక క్రేజు ఉంటుంది. వాళ్లు మళ్లీ కలిసి పనిచేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే కోదండరామిరెడ్డి..., కె. రాఘవేంద్రరావు...., రవిరాజా పినిశెట్టి.. ఇలా వెటరన్స్ కలయికలో సినిమా అంటే ఫ్యాన్స్ చాలా ప్రత్యేకంగా చూసేవారు. ఇప్పడు మెగా వారుసుడు రామ్ చరణ్ విషయంలోనూ ఫ్యాన్స్ గత కొంత కాలంగా అలాంటి కాంబినేషన్ కోసమే ఎదురుచూస్తున్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు - చిరుల కాంబినేషన్ లో మెమరబుల్ హిట్స్ వున్నాయి. అయితే ఈ దర్శకుడితో సినిమా చేయాలన్న కల ఇన్నాళ్లవుతున్నా చరణ్ కు కలగానే మిగిలిపోతోంది. ఈ లెజండరీ డైరెక్టర్ తో చరణ్ కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోపై తాజాగా ఇండస్ట్రీలో కొత్తగా చర్చ మొదలైంది. `జగదేకవీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ ని రామ్‌చరణ్ - జాన్వీకపూర్ లతో చేస్తానని అప్పట్లో రాఘవేంద్రరావు అన్నారు కూడా. ఇందుకు శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నానని అన్నారు.
అశ్వనీదత్ కూడా కాంబినేషన్‌లో కుదిరితే సినిమా చేయడానికి తాను సిద్ధమనే సంకేతాల్ని అందించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు సెట్ కాలేదు. శ్రీదేవి మృతి చెందడంతో సమీకరణాలు మారిపోయాయి. తాజాగా రాఘవేంద్రరావు - రామ్‌చరణ్ ల కలయికలో సినిమా అంటూ చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే రాఘవేంద్రరావు స్పందించాల్సిందే. చరణ్ -జాన్వీ జంటగా `జగదేకవీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ తీస్తే చూడాలన్న ఆశ ఆకాంక్ష అభిమానులకు ఉన్నాయి. కానీ నెరవేరుతుందా? ప‌్రస్తుతం చరణ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఇది సాధ్యమేనా?