Begin typing your search above and press return to search.

టీం ఇండియా క్రికెటర్‌ మళ్లీ తగ్గేదేలే...!

By:  Tupaki Desk   |   17 Oct 2022 6:44 AM GMT
టీం ఇండియా క్రికెటర్‌ మళ్లీ తగ్గేదేలే...!
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదల అయ్యి సంవత్సరం కాబోతోంది.. అయినా కూడా సినిమా యొక్క జోరు కొనసాగుతోంది. టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ప్రతి సారి కూడా సినిమాకు మంచి రేటింగ్ నమోదు అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సీక్వెల్ రూపొందించే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు, ఈ సమయంలోనే పుష్ప సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీవీలో సినిమా ను చూస్తూ ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది.

గతంలోనే రవీంద్ర జడేజా పుష్ప బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా గ్రౌండ్ లో తగ్గేదేలే ఐకానిక్ స్టెప్ వేసిన విషయం తెలిసిందే. మరోసారి పుష్ప సినిమా చూస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఆయనకు అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ యొక్క దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం రవీంద్ర జడేజా మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులు టీవీలో వచ్చిన ప్రతి సారి మళ్లీ మళ్లీ చూస్తూ సందడి చేస్తున్నారు. తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.

మొత్తానికి పుష్ప సినిమా జోరు తగ్గకముందే సీక్వెల్ తీసుకు రావాలని సుకుమార్ భావించినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో పుష్ప సీక్వెల్‌ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

అది ఎంత వరకు సాధ్యమయ్యేను చూడాలి.. పుష్ప సీక్వెల్ గురించి రెగ్యులర్ గా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.. ముందు ముందు మరిన్ని వార్తలు పుష్ప సీక్వెల్ గురించి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.