Begin typing your search above and press return to search.

జాక్వెలిన్ ప్రైవేట్ ఫోటో లీక్.. షేర్ చేయొద్దంటూ అమ్మడి రిక్వెస్ట్..!

By:  Tupaki Desk   |   8 Jan 2022 5:00 PM GMT
జాక్వెలిన్ ప్రైవేట్ ఫోటో లీక్.. షేర్ చేయొద్దంటూ అమ్మడి రిక్వెస్ట్..!
X
శ్రీలంకన్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాల కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రూ.200 కోట్ల స్కామ్ లో ప్రధాన సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కాన్ మ్యాన్ సుకేష్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జాకీ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ విచారణ కూడా ఎదుర్కొంది.

ఈ క్రమంలో మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో అమ్మడి వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఒక ఫొటోలో జాకీకి సుకేష్ ముద్దు పెడితే.. మరో సెల్ఫీలో ఫెర్నాండేజ్ అతన్ని గట్టిగా హత్తుకొని కిస్ చేస్తూ కనిపించింది. తాజాగా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్న పిక్ మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫొటోలో సుఖేష్ - జాక్వెలిన్ ఇద్దరూ మరింత సన్నిహితంగా ఉన్నారు. జాకీని సుఖేష్ ముద్దులతో ముంచెత్తుతుండగా.. ఆమె మెడ మీద గాయం కూడా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో.. సాహో బ్యూటీ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటోంది. ఎమోషనల్ నోట్ ని షేర్ చేస్తూ.. తన పర్సనల్ ఫోటోలని సర్క్యులేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది.

''ఈ దేశం మరియు ఇక్కడి ప్రజలు నాకు ఎంతో ప్రేమను గౌరవాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్న నా స్నేహితులు, మీడియా ఇలా చాలా మంది నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నేను ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఇలాంటి సమయంలో నా ఫ్రెండ్స్ నాకు అండగా ఉంటారని నమ్ముతున్నాను. ఈ నమ్మకంతోనే మీడియాను కోరుతున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించేలా నా పర్సనల్ ఫోటోలను షేర్ చేయవద్దని వేడుకుంటున్నాను. మీకు ఇష్టమైన వారి పట్ల ఇలాంటివి చేయరని నమ్ముతున్నాను. అలానే నా విషయంలోనూ అలా ప్రవర్తించరని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్యూ'' అని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. జాక్వెలిన్ తెలుగులో ‘సాహో’ సినిమాలో ప్రభాస్ తో కలిసి 'బ్యాడ్ బాయ్' పాటకు ఆడిపాడింది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో జాకీ కీలక పాత్ర పోషిస్తోంది. అలానే 'ఎటాక్' 'విక్రాంత్ రోణ' 'బచ్చన్ పాండే' 'సర్కస్' 'రామ్ సేతు' వంటి చిత్రాల్లో జాక్వెలిన్ కనిపించనుంది.