Begin typing your search above and press return to search.

క‌న్ను కొట్ట‌కే కొంటె కోనంగి!

By:  Tupaki Desk   |   10 Sept 2018 5:48 PM IST
క‌న్ను కొట్ట‌కే కొంటె కోనంగి!
X
శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గాళ్ గా సుప‌రిచిత‌మై ఆ త‌ర్వాత బాలీవుడ్‌ లో ప్ర‌వేశించింది. కానీ అక్క‌డ బ్యాక్‌ గ్రౌండ్ లేక - హిట్లు రాక చాలానే స‌త‌మ‌త‌మైంది. ఒకానొక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్నంత డిప్రెష‌న్‌ లోకి వెళ్లాన‌ని తెలిపింది. అయితే ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే! అన్న చందంగా ఈ అమ్మ‌డు ఇప్ప‌టికి బాలీవుడ్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవ‌లే `జుడ్వా 2` చిత్రంతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ అందుకుంది. స‌ల్మాన్ రిక‌మండేష‌న్‌ తో భాయ్ శిష్యుడు వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న జాకీ న‌టించింది. ఆ త‌ర్వాత వెంట‌నే స‌ల్మాన్ న‌టిస్తున్న `రేస్ 3` చిత్రంలోనూ జాకీ అవ‌కాశం అందుకుంది. భాయ్ అండా దండ‌తో జాక్విలిన్ బాలీవుడ్‌ లో ఎదురేలేని నాయిక‌గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకుంటోంది.

ఇదివ‌ర‌కూ `రేస్ 3`లో జాక్విలిన్ లుక్ రిలీజ్ చేసిన‌ప్పుడు యూత్ క‌న్నార్ప‌కుండా వీక్షించారు. నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా జాకీ బ్యాక్‌ లెస్ ఫోజులో చెల‌రేగిపోయిన తీరుకు మ‌తిచెడిపోయిందంతే. ఇదిగో లేటెస్టుగా ఓ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేసింది. ఎంతో జోవియ‌ల్‌ గా అలా క‌న్ను గీటేస్తూ ప‌ళ్లు బ‌య‌ట‌కు పెట్టి మ‌రీ న‌వ్వేస్తోంది. దీంతో ఈ ఫోటోకి అభిమానుల నుంచి అంతే రంజైన కామెంట్లు వ‌చ్చి ప‌డ్డాయి.

మీ ప‌ళ్లు చాలా అందంగా ఉన్నాయ‌ని ఒక అభిమాని అంటే.. అలా కొంటెగా క‌న్నుగీట‌కు! అంటూ వేరొక అభిమాని ట్వీట్ చేశాడు. బ్యూటిఫుల్‌.. ఐ యామ్ వెరీ బిగ్ ఫ్యాన్‌.. నోటీస్ మీ! ప్లీజ్ అంటూ వేరొక అభిమాని వెంట‌పడ్డాడు. డోంట్ షో యువ‌ర్ యాటిట్యూడ్‌ ప్లీజ్ మ్యాడ‌మ్ అంటూ ఇంకో అభిమాని అట‌కాయించాడు. ల‌వ్‌ లీ - జార్జియ‌స్ అంటూ తెగ పొగిడేశారు. ఈ ఫోటో చూస్తే సేమ్ ఫీలింగ్‌ ని మీరు కూడా షేర్ చేస్కోవ‌డం గ్యారెంటీ!!