Begin typing your search above and press return to search.
ఆదర్శంతోనూ మనసు దోచుకుంటోంది
By: Tupaki Desk | 25 March 2016 12:45 PM ISTసిలోన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందాల ఆరబోతతోనే కాకుండా మానవతా దృక్పథంతో కూడా తమిళ ప్రజల మనసు దోచుకుంటోంది. తమిళులు శ్రీలంకను ఎంతమాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చాటుతోంది. తమిళనాడులో ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు జాక్వెలిన్ నడుంబిగించింది. హేబిటేట్ ఫర్ హ్యుమేనిటీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి వరద బాధితుల పునరావాసానికి కష్టపడుతోంది. బాధితులకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తోంది. గివ్ టు హేబిటేట్ అనే వెబ్ పేజ్ ద్వారా ఫండ్ రైజింగ్ చేస్తుండడంతో పాటు బాధితుల కోసం సహాయపడాల్సిందిగా సహ నటులు - టెక్నిషియన్స్ - సినిమా సిబ్బందిని కోరుతోంది.
జాక్వెలిన్ చొరవతో ఇప్పటికే చాలామంది విరాళాలు ఇచ్చారు. మరోవైపు హేబిటేట్ ఫర్ హ్యుమేనిటి సంస్థ విద్యాసంస్థల్లో తిరుగుతూ ఫండ్స్ కలెక్ట్ చేస్తోంది. వారికి తోడుగా జాక్వెలిన్ కూడా విద్యాసంస్థలను సందర్శించి ఫండ్ రైజింగ్ చేయనుంది. శ్రీలంకలో పుట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్టీలో నిలదొక్కుకున్న జాక్వెలిన్ తమిళనాడు వరద బాధితులకోసం ఇంతగా పాటుపడడం గొప్ప విషయమే. ఏప్రిల్ 9న చెన్నై సమీపంలో పడప్పాయ్ లో ఇళ్ల నిర్మాణాన్ని ఆమె ప్రారంభించనున్నారు.