Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు ఫ్యాన్స్ కి జాకీ స్పెషల్ ట్రీట్ ఆ లెవ‌ల్లో

By:  Tupaki Desk   |   14 March 2021 4:10 AM GMT
వీర‌మ‌ల్లు ఫ్యాన్స్ కి జాకీ స్పెషల్ ట్రీట్ ఆ లెవ‌ల్లో
X
శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అటు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు టాలీవుడ్ లోనూ రంగ ప్ర‌వేశం చేసింది. ఇంత‌కుముందు `సాహో` చిత్రంలో బ్యాడ్ బోయ్ సాంగ్ లో అద్భుత‌మైన అప్పియ‌రెన్స్ తో ప్ర‌భాస్ అభిమానుల‌కు ట్రీటిచ్చింది.

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్ మూవీ హ‌రి హ‌ర వీర మ‌ల్లు (#పీఎస్ పీకే 27) చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను జాకీ పోషిస్తోంది. ఈ మూవీ కోసం జాకీ ఏకంగా 40 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించిందని.. హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోంద‌ని తెలిసింది. ప్రముఖ రాజులలో ఒకరి సోదరి పాత్రలో జాకీ న‌టిస్తోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ద్వితీయార్థంలో ఆ పాత్ర చ‌నిపోతుంద‌ట‌.

తాజాగా జాక్విలిన్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఓ ఫోటో వీర‌మ‌ల్లు (ప‌వ‌న్) అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఆల్మోస్ట్ అర్థ‌న‌గ్నంగా జాకీ ఇచ్చిన ట్రీట్ గురించి ప‌వ‌న్ ఫ్యాన్స్ లో చ‌ర్చ సాగుతోంది. ఇక జాక్విలిన్ బాలీవుడ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఎటాక్- భూత్ పోలీస్- సిర్కస్- బచ్చన్ పాండే లాంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది.