Begin typing your search above and press return to search.

సొగసులు చూపిస్తున్న శ్రీలంక సోయగం

By:  Tupaki Desk   |   25 Nov 2016 11:00 AM IST
సొగసులు చూపిస్తున్న శ్రీలంక సోయగం
X
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. ఇండియాలో స్టార్ హీరోయిన్ స్టేటస్ కి అతి దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తో చేసిన సినిమా ఎఫెక్ట్ తో అమ్మడు టాప్ గేర్ లోకి దూసుకుపోయింది. అక్కడి నుంచి తన స్పీడ్ ను కంటిన్యూ చేసేందుకు.. అటు అందాలను.. ఇటు అభినయాన్ని పెట్టుబడిగా పెట్టి బాగానే ఆకట్టుకుంటోంది.

ఈ మధ్య ఈ శ్రీలంక అందం తన బాడీపై మరింతగా దృష్టి పెట్టినట్లు.. రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో తెలిసిపోతోంది. బాగా వర్కవుట్స్ చేయడంతో నునుపుతేలిన అందాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. పర్పుల్ గౌన్ లో అమ్మడు చూపిస్తున్న సోయగాలు.. మైమరపింప చేస్తున్నాయి. ముఖ్యంగా క్లీవేజ్ షో చేయడంలో మరో అడుగు ముందుకేస్తున్నట్లు చెప్పచ్చు. అటు ఆన్ స్క్రీన్ లోనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లో కూడా అందాల మోత మోగించేస్తున్న జాక్వెలిన్.. ఇప్పుడు బాలీవుడ్ లో బోలెడంత డిమాండ్ ఉన్న గ్లామర్ డాల్.

ఏ యాంగిల్ నుంచి చూసినా కనుల విందు చేసే జాక్వెలిన్.. ఇప్పుడు జాకీ లేని గుర్రంలా రెచ్చిపోయేందుకు రెడీ అయిపోయిందా అనిపించక మానదు. వచ్చే ఏడాది ఏకంగా నాలుగు సినిమాలను విడుదలకు క్యూలో పెట్టేసిందంటే జాక్వెలిన్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.