Begin typing your search above and press return to search.

ప్యార్ క‌రోనా అంటూ భాయ్ కి సోపేస్తోందా?

By:  Tupaki Desk   |   3 May 2020 10:40 AM IST
ప్యార్ క‌రోనా అంటూ భాయ్ కి సోపేస్తోందా?
X
కండల హీరో స‌ల్మాన్ ఖాన్ తో శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ర్యాపో గురించి తెలిసిందే. బాలీవుడ్ లో కెరీర్ ఖాళీ అయిపోవ‌డంతో జాకీ పూర్తి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న‌ క్ర‌మంలో భాయ్ లిఫ్ట్ ఇచ్చాడ‌ని త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చింది ఓ ఇంట‌ర్వ్యూలో. కిక్ - రేస్ 3 సినిమాల్లో జాక్విలిన్ కి త‌న స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఇచ్చిన భాయ్ ఆ త‌ర్వాతా వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రేస్ 3లోనూ నాయిక‌గా నటిస్తోంది. ఇక ఇంత‌కుముందు ద‌బంగ్ టూర్ లోనూ భాగ‌స్వామిగా కొన‌సాగింది. అటుపై ఆ స్నేహానుబంధం సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతూనే ఉంది.

క‌రోనా మ‌హ‌మ్మారీ విల‌యం నేప‌థ్యంలో స‌ల్మాన్ భాయ్ గ‌త కొంత‌కాలంగా ఫామ్ హౌస్ లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే జాక్విలిన్ స‌ల్మాన్ కి కంపెనీ ఇస్తోంది. స‌ల్మాన్ పెంపుడు గుర్రాల ఆల‌నా పాల‌నా చూడ‌టం నుంచి ఫామ్ హౌస్ బాధ్య‌త‌ల‌న్నీ జాకీనే చూస్తోంది. అంతేకాదు... ఓవైపు స‌ల్మాన్ భాయ్ జిమ్ వ‌ర్క‌వుట్లు అంటూ బిజీగా ఉంటే అత‌డిపై కెమెరా ఫ్లాష్ లు మెరిపిస్తూ ఆ ఫోటోల్ని అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. ఇప్ప‌టికే కండ‌ల వీరుడి ఫోటోల్ని జాకీ షేర్ చేసింది. తాజాగా ఈ సిరీస్ లో మ‌రో ఫోటోని షేర్ చేసింది. ఇందులో స‌ల్మాన్ చెమ‌ట‌ల‌తో త‌డిసి ముద్ద‌యి సింహ‌బ‌లుడిలా క‌నిపిస్తున్నాడు.

``స‌ల్మాన్ ఫ్యాన్స్ కి ఇంకా ఇంకా చాలా ట్రీట్ ఉంది. వేచి ఉండండి.. ఇండ్ల‌లోనే సురక్షితంగా ఉండండి`` అని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. జాక్వెలిన్ తన ప్ర‌తి పోస్ట్ కు #pyaarkarona అనే హ్యాష్ ట్యాగ్ ‌ను జోడించి ప్ర‌చారం చేస్తోంది. స‌ల్మాన్ కి అభిమానులు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకునేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తూనే ఉంటార‌ని కూడా జాకీ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది. లాక్ డౌన్ తో ప‌ని లేకుండా సల్మాన్ ఖాన్ వ్యాయామానికి ప్రాధాన్య‌త‌నిస్తారని తెలిపింది. ఇక జాక్విలిన్ న‌టించిన తాజా నెట్ ఫ్లిక్స్ సిరీస్ `మిసె‌స్ సీరియ‌ల్ కిల్ల‌ర్` ని భాయ్ స్వ‌యంగా ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాక్విలిన్ - మనోజ్ బాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన `మిసెస్ సీరియల్ కిల్లర్` ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ సిరీస్ కి శిరీష్ కుందర్ దర్శకత్వం వహించారు. ఇది శుక్రవారం స్ట్రీమింగ్ ప్లాట్ ‌ఫామ్ లో విడుదలైంది. జాకీ నెట్ ‌ఫ్లిక్స్ ఆరంగేట్రంపై స్పందించిన స‌ల్మాన్ త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. అన్న‌ట్టు ప్యార్ క‌రోనా! అంటూ జాకీ సంభోధించింది. ఇంత‌కీ ఎవ‌రా ప్యార్ క‌రోనా? స‌ల్మాన్ కి సోపేస్తోందా? అన్న‌ది చూడాలి.

సల్మాన్ ఖాన్ కెరీర్ సంగ‌తి చూస్తే.. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 13 హోస్ట్ గా కనిపించారు. త‌దుప‌రి ఈ ఫ్రాంఛైజీ హోస్ట్ గా ఆయ‌నే కొన‌సాగుతారు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రంలో కనిపించనున్నాడు.