Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఆశగా ఉన్న గుర్రం.. బ్యూటీ సెల్ఫీ!
By: Tupaki Desk | 10 Jun 2019 3:46 PM ISTశ్రీలంక బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి క్రేజ్ పెరిగింది మాత్రం సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమాతోనే. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో 29.2 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం జాక్వెలిన్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "జంతువులన్నిటినీ హర్యానా హైకోర్టు 'చట్టపరమైన వ్యక్తులు' గా డిక్లేర్ చేసింది. పౌరులందరూ ఈ జంతువులకు గార్దియన్స్ అంటూ ప్రకటించింది. పశు సంక్షేమానికి సంబంధించి ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు. నా స్నేహితులైన నాలుగు కాళ్ళ జీవుల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను" అంటూ జాక్వెలిన్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఒక గుర్రం జాక్వెలిన్ ను తాకుతూ మొహం పెట్టింది. జాక్వెలిన్ ఆ అందమైన గుర్రంతో సెల్ఫీ తీసుకుంటూ అల్లరి భామలాగా తన నాలుక బయట పెట్టింది.
ఈ ఫోటోకు కామెంట్లు మామూలుగా లేవు. ఒకరు "ఆ గుర్రంకేదో కావాలి" అన్నారు. మరొకరు "మంచి తీర్పు.. ఇకపై రన్నింగ్ రేస్ లో మనుసులతో పాటు గుర్రాలు పరిగెడతాయి. సినిమాల్లో కూడా గుర్రాలు హీరోయిన్లు" అన్నారు. ఇంకొకరు "నేను ఆ గుర్రమైతే బాగుండేది" అన్నారు. ఈ ఫోటోకు 1 మిలియన్ కు పైగా లైకులు వచ్చాయి. ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'డ్రైవ్' అనే సినిమాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరో కాగా తరుణ్ మన్ సుఖాని దర్శకుడు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.