Begin typing your search above and press return to search.

కంగ‌న‌లా ఆవిడ చెయ్య‌దు క‌దా క్రిష్‌!

By:  Tupaki Desk   |   12 March 2020 2:30 AM GMT
కంగ‌న‌లా ఆవిడ చెయ్య‌దు క‌దా క్రిష్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 27వ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది ఓ పీరియాడిక్ ల‌వ్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది. దీంతో హీరోయిన్ గా ఎవ‌రిని తీసుకుంటారు? అన్న దానిపై కొద్ది రోజులుగా వాడి వేడిగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్...టాలీవుడ్ భామల పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. కానీ ఏదీ అధికారికం కాదు కాబ‌ట్టి న‌మ్మే ప‌రిస్థితి లేదు.

తాజాగా ప‌వ‌న్ కు మెయిన్ లీడ్ గా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ర‌క‌ర‌కాల‌ సందేహాలు వెంటాడుతున్నాయి. ప‌వ‌న్ తో ఈ బ్యూటీ అంత ఈజీ కాదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. ప‌వ‌న్ కేటాయించిన షూటింగ్ డేస్ కి.. ఈ అమ్మ‌డు కేటాయించే షెడ్యూల్ కు మ్యాచ్ అవుతుందా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్స్ చూస్తే.. అత‌డు ఎప్పుడు షూటింగ్ కు వ‌స్తారో? కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి.. ఒక పూట‌ రాజ‌కీయాలు చేసి.. త‌ర్వాత షూటింగ్ కి రావాలి కాబ‌ట్టి ఆయ‌న కేటాయించిన కాల్షీటు ప్ర‌కారం జాక్వెలిన్ హాజ‌ర‌వ్వాల్సి ఉంటుంది.

కానీ అమ్మ‌డు బాలీవుడ్ సినిమాల న‌డుమ ప‌వ‌న్ కోసం అలా అడ్జెస్ట్ చేసుకోగ‌ల‌దా? అన్న‌ది మ‌రో సందేహం. అలా అన్నీ అనుకున్న‌ట్లు గ‌నుక జరిగితే జాక్వెలిన్ లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాసెస్ లో నిర్మాత‌ కు మాత్రం త‌డిసి మోపెడవుతోంది. అలా అన్నింటికి ద‌ర్శ‌క‌ నిర్మాత సిద్ధ‌ప‌డితే ప‌ర్వాలేదు. లేదంటే క్రిష్ కొత్త భామ‌ని వెతుక్కోవాల్సిందేనంటూ సోష‌ల్ మీడియాలో ఆ ర‌క‌మైనా ప్ర‌చారం మొద‌లైంది. జాక్వెలీన్ కన్నా కొత్త నాయిక అయితే త‌మ‌కు అనుకూలంగా.. అందుబాటులో ఉంటుంద‌ని క్రిష్ ఆ ర‌క‌మైన ఆలోచ‌న చేస్తున్న‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి. మ‌రి ఈ స‌స్పెన్స్ కి ఎప్పుడు తెరప‌డుతుందో చూడాలి. ఇక ఇటీవ‌లే బ్యాడ్ బోయ్ అంటూ సాహో చిత్రంలో క‌ల‌రింగ్ ఇచ్చిన జాకీ ఇప్పుడు ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంది అంటే ఇంట్రెస్టింగ్ అంటూ ఫ్యాన్స్ లో టాక్ న‌డుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక‌పోతే క్వీన్ కంగ‌న ఇబ్బంది పెట్టిన‌ట్టుగా క్రిష్ ని వేరొక భామ ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం లేదు. జాకీ తో అస‌లే ఇబ్బంది ఉండ‌దేమో!!