Begin typing your search above and press return to search.

టోట‌ల్ హీరోయిన్ ఫ్యామిలీనే హైజాక్ చేసి ఆడుకున్న గురుడు!

By:  Tupaki Desk   |   15 Dec 2021 6:00 AM IST
టోట‌ల్ హీరోయిన్ ఫ్యామిలీనే హైజాక్ చేసి ఆడుకున్న గురుడు!
X
మ‌మ్మీకో కార్ .. కూతురికో కార్.. అవి కూడా విదేశీ ఖ‌రీదైన బ్రాండ్లే. బ్ర‌ద‌ర్ కి ల‌క్ష‌ల్లో ఆన్ లైన్ ట్రాన్స్ ఫ‌ర్లు.. ఇంట్లో వాళ్ల ప్ర‌యాణాల‌కు టిక్కెట్లు.. ఇక వ్య‌క్తిగ‌త కానుక‌ల‌కు అయితే లెక్కే లేదు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ అత‌డి ఉప్మా తిని బ‌తికేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇంత‌కీ ఎవ‌రది...? అంటే.. సుకేష్ .. ది గ్రేట్ కాన్ మేన్.. 200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ స్కామ్ స్ట‌ర్ తో జాక్విలిన్ ఫ్యామిలీ అలా బుక్క‌య్యింది.

త‌వ్వే కొద్దీ కాలిపోయే నిజాలెన్నో బ‌య‌ట‌ప‌డుతున్నాయి ఈ కేసులో. కేవ‌లం ఒక్క జాక్విలిన్ ఫ్యామిలీకి సుకేష్ నుంచి 10 కోట్ల మేర తాయిలాలు అందాయ‌ని విశ్లేషించింది ఈడీ. ఈ నిజాల‌న్నిటినీ విచార‌ణ‌లో జాక్విలిన్ అంగీక‌రించింది. ఒక్క జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి అత‌డి నుంచి 7కోట్ల విలువ చేసే కానుక‌లు అందాయంటే అర్థం చేసుకోవాలి.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్‌డబ్ల్యూ- పోర్షే కార్ల‌ను అందుకున్నారు. ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ED ఛార్జిషీట్ లో పేర్కొంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్ డబ్ల్యూ- పోర్షే కార్ల‌తో పాటు ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ED ఛార్జిషీట్ లో పేర్కొంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్ లో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని ప‌రిచ‌యం చేసుకునేందుకు తనను తాను శేఖర్ రత్న వేలగా పరిచయం చేసుకున్నాడని పేర్కొంది. డిసెంబర్ 2020లో ఆమెతో టచ్ లో ఉండటానికి అతను చేసిన మొదటి ప్రయత్నంలో అతను విఫలమైన తర్వాత.. జనవరి 2021లో ఆమె మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ద్వారా అతను జాకీని సంప్రదించినట్లు ఏజెన్సీ వెల్లడించింది. షాన్ కి తాను ప్రభుత్వ అధికారిని అని చెప్పుకునే వ్యక్తి నుండి కాల్ వచ్చింద‌ట‌. `చాలా ముఖ్యమైన వ్యక్తి` అయిన శేఖర్ రత్న వేలు జాకీని తప్పనిసరిగా సంప్రదించాలని కోరాడ‌ట‌. ఏజెన్సీకి వెల్ల‌డించిన వివ‌రాల‌లో జాకీ త‌నకు రెండు జతల డైమండ్ చెవిపోగులు.. రెండు హెర్మేస్ బ్రాస్ లెట్ లు.. మూడు బిర్కిన్ బ్యాగ్ లు.. గూచీ దుస్తులు,.. బహుళ వర్ణ రాళ్ల బ్రాస్ లెట్ .. ఒక జత లూయిస్ విట్టన్ షూస్ వంటి బహుమతులు అందుకున్నట్లు పేర్కొంది. మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 15 జతల చెవిపోగులు.. ఐదు బిర్కిన్ బ్యాగులు..ఇతర విలాసవంతమైన వస్తువులను ఇచ్చినట్లు చంద్రశేఖర్ తన ప్రకటనలో ఓపెన్ గా వెల్ల‌డించాడు.

తాను నటి కార్టియర్ కి బ్యాంగిల్స్ - ఉంగరాలు - రోలెక్స్ వాచీలతో పాటు టిఫనీ & కో ఒక బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చానని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నటుడికి కేవలం రూ. 7 కోట్ల విలువైన బహుమతులను ఆభరణాల రూపంలో ఇచ్చానని ఆమెకు `ఎస్పూలా` అనే గుర్రాన్ని బహుమతిగా ఇచ్చానని చెప్పాడు. అతను ఆమెకు ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని జాక్వెలిన్ చెప్పినట్లు తెలిసింది. చంద్రశేఖర్ దాతృత్వం ఆమె కుటుంబానికి కూడా విస్తరించింది. అతను US-లో ఉంటున్న జాక్విలిన్ సోదరుడికి USD 1.5ల‌క్ష‌ల‌ రుణం ఇచ్చాడు. జాక్విలిన్ కు BMW X5ని కూడా ఇచ్చాడు. అయితే ఆ కార్ ని జాకీ తిరిగి అత‌డికి ఇచ్చేసింద‌ట‌. జాక్విలిన్ తల్లిదండ్రులకు మసెరటి -పోర్స్చే కారును కూడా బహుమతిగా ఇచ్చాడు.

సుకేష్ చంద్రశేఖర్ తనను తాను సన్ టీవీ యజమానిగా .. ప్ర‌ముఖ‌ రాజకీయ కుటుంబ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడట‌. ఆ ర‌కంగా జాక్విలిన్ ని ఆమె కుటుంబాన్ని బోల్తా కొట్టించాడు. అంతేకాదు.. అతను అనేక సినిమా ప్రాజెక్ట్‌లకు సంతకం చేయాల‌ని కోరాడు. అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని జాకీకి న‌మ్మ‌బ‌లికాడు. అంతేకాకుండా తాను షోరూమ్ లను నిరంత‌రం సందర్శించేవారిమ‌ని అక్కడ నుండి తనకు కావాల్సిన వస్తువుల జాబితాను చంద్రశేఖర్ కి పంప‌గా.. అత‌డు కార్డ్ పేమెంట్లు చేసేవాడ‌ని ఛార్జ్ షీట్ లో వెల్ల‌డించారు.వాటిని సుకేష్‌ వ్యక్తిగతంగా లేదా అతని సహాయకుల ద్వారా ఆమెకు డెలివరీ చేసేవాడ‌ని జాకీ తెలిపింది. యాక్ట‌ర్ల‌కే దిమ్మ తిరిగిపోయే పెర్ఫామెన్స్ తో స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇచ్చిన సుకేష్ ని ఇండ‌స్ట్రీ గుర్తించ‌లేక‌పోవ‌డం ఘోరం అనుకోవాలేమో! అంటూ ఇవ‌న్నీ తెలిసిన వాళ్లు నోరెళ్ల‌బెడుతున్నారు.