Begin typing your search above and press return to search.
సముద్రాన్ని కడిగిపాడేస్తా అంటోందిగా
By: Tupaki Desk | 7 March 2017 3:48 PM ISTజాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు మహా జోష్ మీద ఉంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులన్నీ ఆమె ముందుకు వచ్చి వాలుతున్నాయి. తాజాగా డ్రైవ్ ఫ్రాంచైజీలో రాబోతోన్న మరుసటి మూవీలో జాక్వెలిన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ప్రకటించాడు నిర్మాత కరణ్ జోహార్. తరున్ మన్సుఖానీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా ఆసక్తి కలిగించేవే.
వరుణ్ ధావన్ తో జుడ్వా 2లో ఇప్పటికే హీరోయిన్ గా నటిస్తున్న జాకీ.. సిద్ధార్ధమల్హోత్రాతో మరో సినిమా కూడా చేసేస్తోంది. ఇలా సినిమాలతో ఆగిపోతే ఆమె జాక్వెలిన్ ఎలా అవుతుంది.. అందుకే సామాజిక అంశాలపై కూడా దృష్టి పెట్టేసింది. త్వరలో ఛారిటీ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేయంది. ఈమె సుముద్ర తీరాన్ని ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి కాపాడేందుకు గాను.. కష్టపడపతోందిట. అంటే సముద్రాన్ని కాలుష్యం పాలు చేసే ప్లాస్టిక్ ను తొలగించే కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం.. ప్రచారం చేయడం చేస్తుందన్న మాట.
జాక్వెలిన్ సొంత దేశమైన శ్రీలంక.. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాక్వెలిన్ కు ఈ యాక్టివిటీపై దృష్టి పెరగడానికి ఇదే కారణం కావచ్చంటున్నారు సన్నిహితులు. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ యాక్టివిటీస్ లోనూ చురుగ్గా పాల్గొనాలని శ్రీలంక అందం జాక్వెలిన్ డిసైడ్ కావడం.. ఆహ్వానించదగ్గ పరిణామమమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/