Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెచ్చగొట్టే జాకీ రూపం

By:  Tupaki Desk   |   7 April 2019 11:05 PM IST
ఫోటో స్టోరి: రెచ్చగొట్టే జాకీ రూపం
X
శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో క్రేజీ కథానాయికగా వెలుగులు విరజిమ్ముతున్న ఈ బ్యూటీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా మొదలై అటుపై బాలీవుడ్ లో కథానాయిక అయ్యింది. వారసత్వ పరిశ్రమలో తనను తాను నిలబెట్టుకునేందుకు జాకీ చాలానే సాహసాలు చేసింది. అవకాశాల్లేక కెరీర్ డీప్ సింకింగ్ లో ఉన్న సమయంలో సల్మాన్ భాయ్ అండతో నిలదొక్కుకోగలిగింది. ప్రస్తుతం భాయ్ సరసన వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అలాగే భాయ్ రికమండ్ చేసే యంగ్ హీరోల సినిమాల్లోనూ నాయికగా నటిస్తోంది. 2018 జాక్విలిన్ కి అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రేస్ 3 చిత్రం ఘోరపరాజయం పాలైంది. అయినా ఈ అమ్మడికి ఇప్పటికిప్పుడు నటించేందుకు అవకాశాలకు కొదవేం లేదు. సల్మాన్ అండదండలు తనకు పెద్ద ప్లస్.

నేటి పోటీ ప్రపంచంలో తనని తాను నిలబెట్టుకునేందుకు జాకీ చేయని ప్రయత్నం లేదు. ఫ్యాన్స్ లో తనకు ఏమాత్రం క్రేజు తగ్గకుండా జాగ్రత్త పడుతుంది. రెగ్యులర్ గా క్యాలెండర్ షూట్లతో వేడి పెంచుతూనే ఉంది. జిమ్ లో రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా కనిపిస్తుంది. తాజాగా జాక్విలిన్ ది బ్రైడ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఇచ్చిన ఫోజులు అభిమానుల్లో వేడి పెంచుతున్నాయి.

తాజా కవర్ షూట్ లో జాక్విలిన్ లుక్ ఫెంటాస్టిక్. చూడగానే ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే అగ్గి రాజేసే డిజైనర్ కాన్సెప్టు జాకీ ఫోటోషూట్ లో కనిపిస్తోంది. డార్క్ థిక్ కలర్ డిజైనర్ డ్రస్ లు.. లైట్ కలర్ డ్రేక్ లుక్.. దానికి కాంబినేషన్ జువెలరీ .. కిల్లింగ్ లుక్స్ తో జాకీ కట్టి పడేస్తోంది. పింక్, వంగ పువ్వు రంగు డిజైనర్ డ్రెస్ లలో జాకీ ఇచ్చిన రకరకాల భంగిమలు యువతరంపై మత్తు చల్లుతున్నాయి. ఈ లుక్ ఫెంటాస్టిక్. జాకీ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ పెంచిందే ఈ వేడెక్కించే వ్యవహారం అనడంలో సందేహమేం లేదు. అది కెరీర్ కి కలిసొస్తుందేమో చూడాలి.