Begin typing your search above and press return to search.

1.5 కోట్ల డబ్బులపై నోరు విప్పిన జాక్వెలిన్ ఫెర్నండేజ్

By:  Tupaki Desk   |   20 Dec 2021 7:00 AM IST
1.5 కోట్ల డబ్బులపై నోరు విప్పిన జాక్వెలిన్ ఫెర్నండేజ్
X
రూ.200 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో సంబంధం ఉందనే ఆరోపణలతో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సుకేష్ ఈడీ విచారణలో ఉన్నాడు. ఈ కేటుగాడు ఈడీతో మాట్లాడుతూ లావాదేవీల గురించి హీరోయిన్ చెబుతున్నవి అబద్దమని చెప్పాడు.

ఇంతకుముందే జాక్వెలిన్ ను కూడా ఈడీ విచారించింది ఈడీ. సుకేష్ అమెరికాలో ఉన్న తన సోదరి గెరాల్డైన్ కి 1.5 లక్షల డాలర్లు (దాదాపు కోటి 10 లక్షలు) ట్రాన్స్ ఫర్ చేశాడు. శేఖర్ నాకు వీరాభిమానిని చెప్పాడు. త్వరలో సౌత్ ఇండియాలో సన్ టీవీ ఎన్నో సినిమాలను నిర్మిస్తోందని.. అందులో నటించమని కోరాడు. అందుకే ఫిబ్రవరి నుంచి ఆయనతో టచ్ లో ఉన్నాని.. అతడు నాకు తన నంబర్ ఇచ్చి కాల్స్ చేయమన్నాడని తెలిపింది.

అయితే జాక్వెలిన్ అబద్దమాడుతోందని సుకేష్ ఈడీ ఎదుట చెప్పాడు. తాను జాక్వెలిన్ సోదరికి 1.8లక్షల డాలర్లు అంటే దాదాపు కోటి 40 లక్షలు ఇచ్చానని తెలిపాడు. అంతేకాకుండా సుమారు రూ.7 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, చెవిపోగులను కొనిచ్చానని వెల్లడించారు. తన బహ్రెయిన్ లో ఈ బ్యూటీ అమ్మకి మసెరటీ, పోర్ష్ కార్లను గిఫ్ట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్ ను ఇటీవల చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించిన తరువాత పోలీసుల షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పైకి చూడ్డానికి మాములుగానే ఉన్నా తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని, తనకు పెద్ద పెద్ద నాయకులతో మంచి సంబంధాలున్నాయని కలరింగ్ ఇస్తారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కన్నారు.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఈడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను విచారించారు. హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న ఈ నటి చంద్రశేఖర్ చేతిలో మోసపోవడం గమనార్హం. పోలీసుల విచారణలో జాక్వెలిన్ పలు ఆసక్తి విషయాలను చెప్పింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూపింగ్ ద్వారా జాక్వెలిన్ ను చంద్రశేఖర్ కలిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని ఫెర్నాండేజ్ ను పరిచయం చేసుకున్నాడు. అయితే జాక్వలిన్ కూడా చంద్రశేఖర్ ను నమ్మింది. ఈ క్రమంలో ఆమెకు చంద్రశేఖర్ ఖరీదైన చాక్లెట్లు, పూలు పంపేవాడు. వీటిని బహుమతి అని చెప్పేవాడు. సుకేశ్ , జాక్వెలిన్ ల మధ్య 20కి పైగా కాల్ రికార్డులు ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాటి ద్వారా జాక్వెలిన్ ను ఎలా మోసం చేశాడో రాబట్లనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం విచారిస్తోంది. చంద్రశేఖర్ తో పాటు లీనా పాల్ లపై 23 చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వారిని విచారించి అనేక విషయాలు రాబట్టామని, భద్రతా కారణాల వల్ల వాటిని వెల్లడించడం లేదంటున్నారు.