Begin typing your search above and press return to search.
200 కోట్ల ఈడీ స్కాంలో ఆ హీరోయిన్ సాక్షి మాత్రమేనట
By: Tupaki Desk | 31 Aug 2021 8:00 PM ISTశ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నిన్న ఈడీ విచారణకు హాజరు కావడం మీడియాలో వైరల్ అయ్యింది. ఈమె ఈ స్కాంలో ఉందా? అని మీడియా ఆరాతీసింది. 200 కోట్ల రూపాయల స్కాంలో ఆమె విచారణ హాజరయ్యిందనే వార్తలు వ్యాపించాయి. అయితే ఈ కేసులో ఆమె ఒక సాక్షిగా.. ఒక బాధితురాలు మాత్రమేనని తాజా సమాచారం.
ఒకవైపు టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు పలువురు ఈ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇదే తరహా స్కామ్ లో విచారణకు ఈడీ అధికారుల వద్ద హాజరైంది. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణలో ఆమెను అధికారులు పిలిచారు.
అయితే ఈ మనీలాండరింగ్ స్కాంలో జాక్వెలిన్ సూత్రధారిగా హాజరు కాలేదట.. కేవలం ఒక సాక్షిగా బాధితురాలిగా హాజరైందని సమాచారం. ఆ ముఠా చేతిలో మోసపోయిన వారిలో జాక్వెలిన్ కూడా ఒకరని వార్తలు వస్తున్నాయి.
ఈ 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ మోసపోయారని తెలిసింది.
జాక్వెలిన్ వద్ద డబ్బులు తీసుకున్నారా? లేక ఆమె ఇమేజ్ ను వాడుకొని మోసం చేశారా? అన్నది మాత్రం అధికారులు బయటపడడం లేదు. ప్రస్తుతానికి సాక్షిగా, బాధితురాలిగా మాత్రమే విచారణకు జాక్వలిన్ హాజరైందని చెబుతున్నారు. ఈ స్కాంకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.