Begin typing your search above and press return to search.

సెట్ లోనే పెళ్లిచేసుకున్న హీరోయిన్!

By:  Tupaki Desk   |   12 Aug 2016 6:42 AM GMT
సెట్ లోనే పెళ్లిచేసుకున్న హీరోయిన్!
X
ఈ రోజుల్లో సినిమా తీయడం.. దాని సక్సెస్ సంగతి అటుంచి, ముందుగా సక్సెస్ ఫుల్ గా విడుదలచేయడంతో పాటు.. అంతకంటే ముందుగా ఆ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ చేసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే.. బాలీవుడ్ లో స్టార్ లంతా పోటీపడిమరీ తమ సినిమాలను ప్రచారం చేసుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ కచ్చితంగా అభినందనీయులే. తాజాగా తాను నటించిన "ది ఫ్లైయింగ్ జాట్" సినిమా కోసం ప్రత్యేకమైన ప్రచారాన్ని నిర్వహించింది జాక్వెలెస్! దీనికోసం కామెడీ కింగ్ కపిల్ శర్మ షోను వేదికగా చేసుకుంది.

"ది ఫ్లైయింగ్ జాట్" సినిమా ప్రచారం కోసం కపిల్ శర్మ షోకి వచ్చిన జాక్వెలెస్ సడన్ గా పెళ్లికూతురైపోయింది. ఘనంగా పెళ్లికూడా చేసేసుకుంది. ఇంతకూ పెళ్లికొడుకు ఎవరంటారా...? ఇంకెవరు కపిల్ శర్మే! అవును కపిల్ శర్మను పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ అంగీకరించడంతో, దానికి కపిల్ శర్మ ఎగిరి గంతేయడంతో కపిల్ - జాక్వెలెస్ ల పెళ్లి జరిగిపోయింది. అనుకున్నదే తడువుగా సెట్లో ఇద్దరు దండలు మార్చుకుని ఉత్తుత్తి పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఫొటోలను తన ట్విట్టర్ పేజీలో పెట్టి కామెంట్ చేశారు కపిల్ శర్మ.

తనను ఆనందంగా ఉంచుతానని జాక్వెలెస్ మాట ఇచ్చిందని.. అంతేకాకుండా షాపింగ్ కు, షికార్ కు తీసుకెళ్తానని చెప్పిందని కామెంట్ పెట్టాడు. అయితే ఈ కపిల్-జాక్వెలెస్ పెళ్లి ఫొటో చూసిన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ ఫింగర్స్ కు పని చెప్పి.. తమదైన శైలిలో కామెంట్లు పేడుతున్నారు.