Begin typing your search above and press return to search.

బర్త్‌ డే స్పెషల్‌.. 'విక్రాంత్ రోణ' బ్యూటీ లుక్‌

By:  Tupaki Desk   |   11 Aug 2021 12:30 PM GMT
బర్త్‌ డే స్పెషల్‌.. విక్రాంత్ రోణ బ్యూటీ లుక్‌
X
కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చ సుదీప్‌ హీరోగా రూపొందుతున్న విక్రాంత్ రోణ పాన్ ఇండియాను మించి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విక్రాంత్ రోణ సినిమాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ అమ్మడి లుక్‌ ను సినిమా నుండి రివీల్‌ చేయడం జరిగింది. సుదీప్‌ తో జాక్వెలిన్ ఫొటో షూట్‌ ను కూడా ఇటీవల రివీల్‌ చేశారు. తాజాగా మరోసారి ఆమె బర్త్‌ డే సందర్బంగా విక్రాంత్‌ రోణ సినిమా నుండి ఆమె లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది.

శ్రీలంకన్‌ బ్యూటీ అయిన జాక్వెలిన్ ఈమద్య కాలంలో పూర్తిగా ఇండియన్ సినిమాలకే పరిమితం అయ్యింది. ఆమె వరుసగా హిందీ సినిమాలు చేస్తూ వస్తోంది. హీరోయిన్ గా ఐటెం సాంగ్స్‌ ను చేయడంతో పాటు అన్ని రకాల పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బుల్లి తెరపై నే కాకుండా మ్యూజికల్‌ వీడియోలు మరియు వెబ్‌ సిరీస్ లు ఇలా అనేక రకాలుగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆకట్టుకుంటూ వచ్చింది.

ప్రస్తుతం ఈమె కన్నడ మూవీ విక్రాంత్‌ రోణ లో నటిస్తోంది. ఈ అమ్మడి ఎంట్రీతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది అనడంలో సందేహం లేదు. విక్రాంత్‌ రోణ సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుంది అంటూ కన్నడ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. సినిమాలో జాక్వెలిన్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది. త్వరలో ఈమె తెలుగు లో పవన్‌ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.