Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కారు దిగి కిర్రెక్కించిన బూటీ

By:  Tupaki Desk   |   15 March 2022 9:00 AM IST
ఫోటో స్టోరి: కారు దిగి కిర్రెక్కించిన బూటీ
X
కారు దిగి కిర్రెక్కించే ఫోజుల‌తో చెల‌రేగింది. స్టైల్ ఐక‌న్ అన్న ప‌దానికి నిర్వ‌చ‌నంలా క‌నిపించింది. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే .. బ్యాడ్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్. సాహో లో బ్యాడ్ బోయ్ సాంగ్ తో జాకీకి తెలుగు యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవ‌ల సుఖేష్ చంద్ర తో ప్రేమాయ‌నం ఎపిసోడ్ లీకులు త‌న‌ని కొంత బ్యాడ్ చేసినా కానీ అది కూడా ప్ర‌చారానికి క‌లిసొచ్చింది.

తాజాగా జాక్విలిన్ న‌టించిన భారీ చిత్రం `బ‌చ్చ‌న్ పాండే` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కి విచ్చేసిన జాక్విలిన్ ఇలా రంగు రంగుల‌ పూల పూల చొక్కాయ్ .. పూల డిజైన్ తో త‌యారు చేసిన బాట‌మ్ ని ధ‌రించి మైండ్ బ్లాక్ చేసింది. జాక్విలిన్ అలా ఒళ్లు మ‌రిచి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన తీరు మ‌తులు చెడ‌గొడుతోంది. అల్ట్రా పోష్ జాక్విలిన్ రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో యువ‌త‌రాన్ని కిల్ చేస్తోంది. ఇందులో లేటెస్ట్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

బాలీవుడ్ హాట్ గాళ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్ర‌స్తుతం బచ్చన్ పాండే ప్ర‌మోష‌న్ పైనే దృష్టి సారించింది. చిత్ర‌బృందం 18 మార్చి 2022న మూవీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో జాకీ సరదాగా రాపిడ్-ఫైర్ క్విజ్ లో పాల్గొని కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. బచ్చన్ పాండే రొమాన్స్ ని ఒక్క మాటలో వివరించమని అడ‌గ్గా.. ఆమె `వెరీ వెరీ రొమాంటిక్` అంటూ హైప్ పెంచేసింది.

మరొక సెగ్మెంట్ లో జాకీ ఎప్పుడైనా తన దుస్తుల వోన్ బ్రాండ్ ని కలిగి ఉందా? అని ప్ర‌శ్నిస్తే.. దానికి ఆమె `ఏ పేరు పెడతారు?` అని స‌ర‌దాగా అడిగేశారు. దానికి అక్షయ్ కుమార్ `జాక్ లీన్ ఆన్ మి` అని వెంటనే సమాధానమిచ్చాడు. చిత్రనిర్మాత ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కీ- జాక్విలిన్ తో పాటు కృతి సనన్ కూడా కీలక పాత్రలో నటించింది. మూవీ షెడ్యూల్ లో తన భాగాన్ని పూర్తి చేసిన‌ తర్వాత, జాక్వెలిన్ బచ్చన్ పాండే సెట్ లోని కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల కొంత‌కాలంగా జాక్వెలిన్ -బచ్చన్ పాండే బృందం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. జాకీతో పాటు ఈ చిత్రంలో న‌టించిన కీల‌క తారాగ‌ణం ప్ర‌మోష‌న్స్ కి విచ్చేస్తున్నారు. అక్షయ్ కుమార్- కృతి సనన్,- పంకజ్ త్రిపాఠి- అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించారు.